పాములు జీవవైవిధ్యం పెంపోందించడంలో ముందుటాయనే విషయం చాలామందికి తెలియదు. అయితే పాముల్లో కొన్ని సాధారణమైనవి ఉంటే.. మరికొన్ని చాలా విషపూరితంగా ఉంటాయి. ఇక కాటేస్తే నిమిషాల్లోనే కాటికి వెళ్లాల్సిందే. మనదేశంలో అలాంటి విషపూరిత పాములెన్నో ఉన్నాయి.. తాజాగా మరో అరుదైన విష సర్పాన్ని గుర్తించారు రిసెర్చర్స్. బ్రౌన్-స్పాట్ పిట్విపర్ (ప్రోటోబోథ్రోప్స్ మ్యూక్రోస్క్వామటస్) అనే విషపూరిత పామును అస్సాంలో మొదటిసారి గుర్తించారు. మయన్మార్, లావోస్, చైనా సహా పలు ఆగ్నేయాసియా దేశాల్లో ఈ పాము ఉన్నట్లు తేల్చి చెప్పారు.
భారతదేశంలో బ్రౌన్-స్పాట్ పిట్విపర్ విషపూరిత పాముల మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అస్సాంలోని కర్బీ-అన్లాంగ్ జిల్లాలో ఈ అరుదైన పామును గుర్తించారు. వెదురు అటవీ ప్రాంతంలో కనిపించిన ఈ పాముపై పలువురు పరిశోధనలు చేసినట్టు తెలుస్తోంది. అరిజిత్ దత్తా, జయంత్ కుమార్ రాయ్, సౌరవ్ గుప్తా, ఎం ఫిరోజ్ అహ్మద్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ విష సర్పాన్ని గుర్తించి కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2022 ఆగస్టులోనే పరిశోధక బృందం అటవీ మార్గంలో ఈ పాములు ఉన్నట్టు చెప్పారు.
కాగా గత సంవత్సరం అసోంలోని జోర్హాట్ జిల్లాలో ఓ ఇంట్లో నాగుపాములు సహా 20 విషపూరిత పాములను పట్టుకున్నారు. శంకర్ బనియా అనే వ్యక్తి ఇంటి నుంచి అరుదైన పాములు ఉండటం ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. పాములు తన ఇంట్లో ఆశ్రయం పొందాయని, వన్యప్రాణుల అక్రమ రవాణాతో తనకు సంబంధం లేదని బనియా చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.