
Ram Charan Fan Peddi Movie Dance: సోషల్ మీడియాలో ఒక సామాన్యుడి ప్రతిభ స్టార్ హీరోల క్రేజ్‌ను కూడా దాటేస్తుంటుంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ అభిమాని ఒకరు థియేటర్లో చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. రామ్ చరణ్ సిగ్నేచర్ స్టెప్‌ను ఆ అభిమాని రీక్రియేట్ చేసిన విధానం చూసి, నెటిజన్లు సైతం చరణ్‌ను మించిపోయాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా థియేటర్లోకి వస్తోందంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. కాగితాలు చల్లడం, ఈలలు వేయడం, స్క్రీన్ ముందు డ్యాన్స్ చేయడం మనకు తెలిసిందే. కానీ, ఇక్కడొక మెగా అభిమాని మాత్రం కేవలం ఎంజాయ్ చేయడానికి కాకుండా, తనలోని అద్భుతమైన డ్యాన్సర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. వెండితెరపై రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తుంటే, కింద ఆ అబ్బాయి వేసిన స్టెప్పులు థియేటర్లోని ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అక్కడ ఉన్నవారంతా సినిమా చూడటం పక్కనబెట్టి, ఈ కుర్రాడి వైపే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయారు.
Video: అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే.. ఆ తర్వాత సీన్ చూస్తే..!
ఈ వైరల్ వీడియోలో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే.. ఆ యువకుడు ఎలాంటి తడబాటు లేకుండా, అత్యంత కఠినమైన డ్యాన్స్ మూమెంట్‌ను ఒకే ఒక్క టేక్‌లో పూర్తి చేయడం. సాధారణంగా హీరోలు ఇటువంటి స్టెప్పుల కోసం ఎన్నో రిహార్సల్స్ చేస్తారు, కొరియోగ్రాఫర్ల సహాయం తీసుకుంటారు. కానీ ఈ అభిమాని మాత్రం ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా, థియేటర్ స్క్రీన్ లైటింగ్ మధ్యలో ఆన్ ది స్పాట్ ఊపు ఊపేశాడు. అతనిలోని ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, టైమింగ్ చూస్తుంటే అసలు హీరో కంటే ఈ అబ్బాయే బాగా చేశాడేమో అనేంతగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీన్నే కదా ‘మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ’ అనేది అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ వీడియో వైరల్ గా మారింది. “ఈ రామ్ చరణ్ అభిమాని థియేటర్లో సింగిల్ టేక్‌లో డ్యాన్స్ ఇరగదీశాడు, అసలు హీరోనే మించిపోయాడు” అనే శీర్షికతో ఉన్న ఈ పోస్ట్‌కు లక్షల్లో వీక్షణలు, వేలల్లో లైకులు వస్తున్నాయి. మెగా అభిమానులైతే ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ సోషల్ మీడియా టైమ్‌లైన్‌లను హోరెత్తిస్తున్నారు. ఒక సామాన్య కుర్రాడికి ఉన్న ఈ అసాధారణ ప్రతిభను చూసి యావత్ సినీ ప్రపంచం అభినందిస్తోంది. భవిష్యత్తులో ఈ కుర్రాడికి వెండితెరపై కూడా అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..