
ఈ రోజుల్లో వాషింగ్ మెషీన్ అనేది అందరి ఇళ్లలో కామన్‌గా మారింది. దీన్ని వల్ల బట్టలు ఉతికే మహిళల పని చాలా ఈజీగా మారింది. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. వాషింగ్ మెషీన్‌కు సంబంధించి రకరకాల చిట్కాలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో ఒక సరికొత్త క్రేజీ ట్రిక్ తెగ హల్‌చల్ చేస్తోంది. వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు అందులో కేవలం 2 ఐస్ క్యూబ్స్ వేయాలనే ట్రిక్ తెగ వైరల్‌గా మారింది. ఇలా చేయడం వల్ల బట్టలపై ఉండే ముడతలు మాయమవుతాయని, బట్టలు ఇస్త్రీ చేసినట్లుగా సరికొత్తగా కనిపిస్తాయని నెటిజన్లు అంటున్నారు. మరి ఈ వైరల్ ట్రిక్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వైరల్ వీడియోల ప్రకారం.. వాషింగ్ మెషీన్‌లో బట్టలతో పాటు 2 నుండి 3 ఐస్ క్యూబ్స్ వేసి మెషీన్ రన్ చేయడం వల్ల బట్టల ముడతలు కొంతవరకు తగ్గుతాయి. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే.. మెషీన్ తిరుగుతున్నప్పుడు లోపల ఉండే వేడికి ఆ ఐస్ క్యూబ్స్ కరిగి క్రమంగా ఆవిరి, తేమగా మారుతాయి. ఈ తేమ బట్టల నూలు పోగులను కాస్త మెత్తగా చేస్తుంది. దీనివల్ల బట్టలు ఎక్కువగా నలిగిపోకుండా, ముడతలు పడకుండా బయటకు వస్తాయి. ముఖ్యంగా వాషింగ్ మెషీన్ డ్రైయర్ సైకిల్‌లో ఈ చిట్కా బాగా పాపులర్ అయింది. అయితే దీని ప్రభావం బట్టల రకం, మెషీన్ మోడల్, మీరు సెలెక్ట్ చేసుకునే వాషింగ్ మోడ్‌పై ఆధారపడి ఉంటుంది.
హల్కా బట్టలకు బెస్ట్: కాటన్ షర్టులు లేదా పలచని లైట్ వెయిట్ బట్టలపై ఉండే చిన్న చిన్న ముడతలను తగ్గించడానికి ఈ ట్రిక్ కొంతవరకు హెల్ప్ అవుతుంది.
బట్టలు ఫ్రెష్‌గా ఉంటాయి: ఐస్ క్యూబ్స్ వల్ల ఏర్పడే తేమ కారణంగా బట్టలు ఉతికిన తర్వాత మరింత ఫ్రెష్‌గా, సాఫ్ట్‌గా అనిపిస్తాయి.
ఇస్త్రీకి ఇది ప్రత్యామ్నాయం కాదు: ఈ ట్రిక్ వల్ల ముడతలు కొంతవరకు తగ్గుతాయి కానీ.. ఇది పక్కా ఐరన్ చేసినట్లు మారుస్తుందని అనుకోలేం. భారీ ముడతలు పోవాలంటే ఇస్త్రీ చేయాల్సిందే.
ఎక్కువ ఐస్ ముక్కలు వేయకండి: మెషీన్‌లో కేవలం 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ మాత్రమే వేయాలి. అంతకంటే ఎక్కువ వేస్తే లోపల నీళ్లు ఎక్కువై అనుకున్న రిజల్ట్ రాదు.
భారీ బట్టలపై పనిచేయదు: జీన్స్, మందపాటి దుప్పట్లు లేదా ఉన్ని బట్టలపై ఈ ఐస్ క్యూబ్స్ ట్రిక్ అస్సలు ప్రభావం చూపదు.
ఈ హోమ్ రెమెడీని ట్రై చేసే ముందు మీ వాషింగ్ మెషీన్ మ్యాన్యువల్ బుక్‌ను ఒకసారి సరిచూసుకోండి. మెషీన్ లోపల ఇలాంటివి వేయకూడదని రూల్స్ ఉంటే మాత్రం ఈ ప్రయోగానికి దూరంగా ఉండటమే మంచిది.