Save Water: టాయిలెట్‌ని ఉపయోగించి ప్లష్ చేయని యువతి.. రీజన్ తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే..

|

Apr 17, 2024 | 9:13 PM

ఓ యువకుడు తన కష్టాలను రెడ్డిట్‌లో సుదీర్ఘ పోస్ట్‌ ద్వారా వివరించాడు. తన ప్రియురాలు మూత్ర విసర్జన తర్వాత కమోడ్‌ను ఫ్లష్ చేయదు. తన భాగస్వామి ఉన్న ఈ 'అత్యంత అసహ్యకరమైన' అలవాటు ముఖ్య  ఉద్దేశ్యం ఏమిటంటే నీటి వృధాను ఆపడం అని చెప్పాడు. ఈ విషయం చదివిన తర్వాత నెటిజన్లు రకరకాల సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. కొందరు ఇది చదివాక తల తిరుగుతోందని అన్నారు. 

Save Water: టాయిలెట్‌ని ఉపయోగించి ప్లష్ చేయని యువతి.. రీజన్ తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే..
Woman Idea To Save Water
Image Credit source: Pexels
Follow us on

ఎవరైనా ఎప్పుడైనా పొరపాటున టాయిలెట్‌ని ఉపయోగించిన తర్వాత ఫ్లష్ చేయడం మర్చిపోయి ఉండవచ్చు.. అయితే ఎవరైనా ఈ చర్యను ‘ఎకో ఫ్రెండ్లీ’ అని చెబుతూ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పని చేస్తే ఏమి అనాలి. అటువంటి వ్యక్తులను ఏమి చెయ్యాలి. ఓ వ్యక్తి తన ప్రియురాలి గురించి సోషల్ మీడియాలో విచిత్రంగా వెల్లడించడం విషయం ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. మూత్ర విసర్జన తర్వాత తన ప్రేయసి  కమోడ్‌ను ఫ్లష్ చేయదని ఆ వ్యక్తి చెప్పాడు. దీని వెనుక ఉన్న మహిళ లాజిక్ వింటే ఎవరైనా సరే తలపై కొట్టుకుంటారు..

ఆ యువతి ఎందుకు అలాంటి పని చేస్తుందా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. LADbible నివేదిక ప్రకారం.. ఓ యువకుడు తన కష్టాలను రెడ్డిట్‌లో సుదీర్ఘ పోస్ట్‌ ద్వారా వివరించాడు. తన ప్రియురాలు మూత్ర విసర్జన తర్వాత కమోడ్‌ను ఫ్లష్ చేయదు. తన భాగస్వామి ఉన్న ఈ ‘అత్యంత అసహ్యకరమైన’ అలవాటు ముఖ్య  ఉద్దేశ్యం ఏమిటంటే నీటి వృధాను ఆపడం అని చెప్పాడు. ఈ విషయం చదివిన తర్వాత నెటిజన్లు రకరకాల సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. కొందరు ఇది చదివాక తల తిరుగుతోందని అన్నారు.

ఆ ప్రేమికుడు తన బాధను రకరకాలుగా తెలియజేశాడు. తన ప్రియురాలి అభిప్రాయాలతో కొంత వరకు తాను  ఏకీభవిస్తున్నట్లు చెప్పాడు. అయితే తాను తన ప్రేమికురాలు మూడుసార్లు మూత్ర విసర్జన చేసిన తర్వాత కమోడ్‌ను ఒకసారి ఫ్లష్ చేయమని అభ్యర్థించినట్లు చెప్పాడు. అయితే తాను చేసిన అభ్యర్థనను కూడా నీరు  వృథా చేయకూడదని ఆ యువతి తిరస్కరించినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మహిళ టాయిలెట్ అలవాటు గురించి ఆమె భాగస్వామి చెప్పిన విషయం ఇప్పుడు ఇంటర్నెట్‌లో కొత్త చర్చ మొదలైంది. చాలా మంది వినియోగదారులు Reddit పోస్ట్‌లో ప్రాథమిక పరిశుభ్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరు వ్రాశారు నీటిని వృథా చేయకూడదనేది మంచి సాకు అన్నారు. అదే సమయంలో మరొకరు ఈ అలవాటు వ్యాధికి నిలయంగా మారుతుందని చెప్పారు. స్త్రీలు రోజంతా నీరు మాత్రమే తాగితే బహుశా వాసన ఉండదేమో అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..