Watch Video: రీల్స్ చేస్తుండగా షాకింగ్ ఘటన.. నవ్వుకుంటున్న నెటిజన్స్.. వీడియో వైరల్

ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. తమ టాలెంట్‌ను ఒక వీడియో రూపంలో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందుకుగానూ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, షేర్ చాట్ ఇలా రకరకాల యాప్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని పోస్ట్ చేశాక షేర్లు, లైకులు, కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో అనేక ప్రమాదాలకు గురైన వాళ్లూ ఉంటారు. మరి కొందరు చట్టపరమైన ఇబ్బందులు ఎర్కొన్నారు.

Watch Video: రీల్స్ చేస్తుండగా షాకింగ్ ఘటన.. నవ్వుకుంటున్న నెటిజన్స్.. వీడియో వైరల్
Pakistani Girl’s Funny Video Turns Into Two Sisters Fight After She Records Other One

Updated on: Nov 20, 2023 | 5:31 PM

ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. తమ టాలెంట్‌ను ఒక వీడియో రూపంలో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందుకుగానూ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, షేర్ చాట్ ఇలా రకరకాల యాప్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని పోస్ట్ చేశాక షేర్లు, లైకులు, కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో అనేక ప్రమాదాలకు గురైన వాళ్లూ ఉంటారు. మరి కొందరు చట్టపరమైన ఇబ్బందులు ఎర్కొన్నారు. ఇదే నేటి కాలం యువతకు కాలక్షేపంగా మారిపోయింది. అయితే తాజాగా ఇలా వీడియో తీసుకునే క్రమంలో జరిగిన సంఘటన నవ్వు తెప్పించేలా మారింది. ఘర్ కే కలేష్ అనే అకౌంట్లో పాకిస్తానీ యువతులు పోస్ట్ చేశారు.

ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఒక చోట చేరితే అది సందడి వాతావరణాన్నైనా సృష్టిస్తుంది. లేకపోతే ఘర్షణకైనా దారితీస్తుంది. దీనికోసం ప్రత్యేకించి ఎలాంటి కారణాలు అక్కర్లేదు, ఇది సహజ నైజం. అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు పాకిస్తానీ యువతులు ఒక వీడియో చేసేందుకు సిద్దమయ్యారు. వీడియో ప్రారంభించిన కొన్ని సెకన్లలోపే పక్కనే ఉన్న యువతి చెంప చెళ్లుమనిపించింది. చెంప దెప్ప తిన్న వెంటనే ప్రతిస్పందించి తనపై చెయ్యి చేసుకున్న అమ్మాయిని లాగిపెట్టి కొట్టింది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన మొత్తం ఫోన్లో రికార్డ్ అయింది. ఆ వీడియోను ఎక్స్ (ట్విట్టర్ ఖాతాలో) పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. ఈ వీడియోను చూసిన వారు రియలిస్టిక్‌గా ఉండటంతో ఆశ్చర్యపోతున్నారు. దీనిపై స్పందిస్తూ రకరకాలా కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో అమ్మాయిలు పాకిస్తానీ, బ్రిటీష్ యాసలో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. మరి కొందరు తమ చేతులకు బదులుగా ఏకే47ను ఉపయోగించి ఉంటే బాగుండేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా మొత్తం మీద 87 మంది కామెంట్ చేయగా.. ఇప్పటి వరకూ దాదాపు మూడు లక్షల మంది ఈ వీడియోను చూసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..