Optical Illusion: మీకో సవాల్.. ఈ జంతువుల మధ్య దాగి ఉన్న నెమలిని 10 సెకన్లలో కనిపెడితే మీరే తోపు!

మీరు తెలివితేటలను పెంచుకోవాలనుకుంటున్నారా? మీ పరిశీలనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఇక్కడ మేము ఇవ్వబోయే పజిల్‌ను మీరు సాల్వ్ చేయాల్సిందే. ప్రతిరోజూ ఇలా ఒక్క పజిల్ సాల్వ్ చేస్తే చాలు.. మీ ఆలోచనా శక్తితో పాటు పరిశీలనా నైపుణ్యాలు కూడా సులభంగా మెరుగుపడతాయి. మరి ఈ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు మీరు సిద్ధమేనా?

Optical Illusion: మీకో సవాల్.. ఈ జంతువుల మధ్య దాగి ఉన్న నెమలిని 10 సెకన్లలో కనిపెడితే మీరే తోపు!
Optical Illusion Test

Updated on: Oct 22, 2026 | 3:40 PM

Optical Illusion Challenge: సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యే చిత్రాల్లో దాదాపు 80 శాతం మందిని ఆకర్షించేవి కేవలం ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలే. ఎందుకంటే ఇవి కళ్లకు, మెదడుకు మేత వేయడమే కాకుండా.. మనుషుల తెలివితేటలకు కూడా సవాల్ విసురుతాయి. దీంతో నెటిజన్లు దీనిని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా నిరంతరం మెదడుకు పదును పెట్టడం వల్ల బ్రెయిన్ ఎంతో యాక్టివ్‌గా పనిచేయడం ప్రారంభిస్తుంది.

ఈ ప్రక్రియ కేవలం పజిల్స్ సాల్వ్ చేయడానికే కాకుండా.. నిజ జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే మీ ఆలోచనా పదునును పెంచుకోవాలనుకుంటే ఇది ఒక చక్కని మార్గం. మరి ఆలస్యమెందుకు? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్‌ను సాల్వ్ చేసి మీ తెలివితేటలకు పరీక్ష పెట్టుకోండి.

వైరల్ చిత్రంలో ఏముంది?

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ చిత్రంలో కొన్ని జంతువుల గుంపు కనిపిస్తుంది. అందులో పులులు, సింహాలు, జిరాఫీలు, ఏనుగులు.. ఇలా రకరకాల జంతువులతో పాటు పక్షులు కూడా ఉన్నాయి. అయితే వాటన్నింటి మధ్యలో ఒక నెమలి కూడా దాక్కుని ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఆ చిత్రంలో దాగున్న నెమలిని కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలి. ఈ సవాల్‌ను స్వీకరించేందుకు మీరు సిద్ధమైతే.. మీ సమయం ఇప్పుడే మొదలైంది!

నెమలిని కనిపెట్టారా?

ఇచ్చిన సమయంలోనే మీరు నెమలిని కనిపెట్టినట్లయితే కంగ్రాట్స్! మీ చూపు చాలా షార్ప్‌గా ఉందని అర్థం. ఒకవేళ ఎంత వెతికినా మీకు ఆ నెమలి జాడ దొరకకపోతే ఏమాత్రం కంగారు పడకండి.. అది ఎక్కడ దాక్కుందో మేము మీకు చూపిస్తాం. ఆ నెమలి ఉన్న స్థానాన్ని కింద ఇచ్చిన చిత్రంలో ఎరుపు రంగుతో సర్కిల్ చేసి ఉంచాం. అక్కడ చూసి మీరు దాన్ని సులభంగా గుర్తించవచ్చు. సమాధానం కనిపెట్టేందుకు ప్రయత్నించినందుకు ధన్యవాదాలు!

Optical Illusion Test (1)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us