ఆప్టికల్ ఇల్యూజన్ కేవలం టైమ్ పాస్ అవ్వడానికి మాత్రమే కాదు మెదడుకు మేతలా కూడా ఉపయోగపడతాయి. ఒకప్పుడు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్స్‌కు సంబంధించిన ఫొటోలు కేవలం న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి ఆన్‌లైన్‌లోనూ వీటి హంగామా పెరిగింది. ఎన్నో రకాల ఆప్టికల్ ఇల్యూజన్‌లకు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. ఫొటోలో దాగున్న వస్తువులను గుర్తించడం ఒకరకమైన పజిల్ అయితే. కనిపించి కనిపించన్నట్లుండే నెంబర్లకు సంబంధించిన పజిల్స్ మరికొన్ని.
ఇక ఇటీవలి కాలంలో కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు సైతం ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా వారు పోస్ట్ చేసే కొన్ని పజిల్స్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వాటి అంతు తేల్చేస్తామంటూ పట్టుపడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ నెట్టింట సందడి చేస్తోంది. ఛత్తీస్‌ఘడ్ క్యాడర్‌కు చెందిన అవినాశ్ శరన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఒక నెంబర్ ఆప్టికల్ ఇల్యూజన్‌ను ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో కనిపిస్తోన్న నెంబర్‌ను మీరు గుర్తించగలరా.? అంటూ ఫొటోను ట్వీట్ చేశారు.
What number do you see ? pic.twitter.com/hwKgMdJjcL
— Awanish Sharan (@AwanishSharan) January 22, 2023
దీంతో ఈ పజిల్ సంగతి కనిపెడతామంటూ చాలా మంది ప్రయత్నించారు. వేలల్లో లైక్‌లు కామెంట్స్ చేశారు. వీరిలో చాలా మంది ‘571’ నెంబర్ కనిపిస్తోంది అంటూ కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం ‘35174’ నెంబర్ కూడా ఉందంటూ స్పందించారు. ముందుగా నేరుగా చూస్తే ఫొటోలో 571 నెంబర్ మాత్రమే కనిపిస్తోంది. అయితే ఓసారి క్షుణ్నంగా చూస్తే ఈ మూడు నెంబర్లకు రెండు వైపులా ‘3,4’ నెంబర్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలా కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది కాబట్టే వీటికి ఆప్టికల్ ఇల్యూజన్ అనే పేరు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..