
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. డ్యాన్స్, పాటలు, ఫైట్లు, కామెడీ, క్రైమ్ ఇలా పలు రకాల వీడియోలు, రీల్స్ నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఆమె డ్యాన్సర్ కాదు, సింగర్ కాదు.. సుతారి పని చేసే మేస్త్రీ. సాధారణంగా అయితే సుతారీ మేస్త్రీలు మగవారే ఎక్కువగా ఉంటారు. మహిళలు ఆ పనికి వెళ్లినా హెల్పర్లుగానే పనిచేస్తారు. కానీ, ఈమె కాస్త డిఫరెంట్.. బొచ్చలో మాల్ వేసుకొని.. తాపీతో ఇంటి పైకప్పుకు ప్లాస్టింగ్ రఫ్పాడించేసింది. ఆమె సుతారి పని చేస్తున్న వీడియోలో ఆమె స్పీడ్ ఒక్కటే హైలెట్ కాదు.
సరిగ్గా గమనిస్తే.. ఆమె పని చేస్తున్న ఫ్లోలో ఒక రిథమ్‌లో సౌండ్ వస్తుంది. దాన్ని బీజీఎంలా వాడుకోవచ్చు అని కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్ కూడా చేస్తున్నారు. ఏ తమన్ అన్నకో, లేదా అనిరుద్ధ్‌కో ఈ వీడియో కంట పడితే.. వాళ్లు ఈ సౌండ్‌ను అదిరిపోయే బీజీఎంగా మార్చేస్తారని అంటున్నారు. నిజంగానే కాస్త స్పీడ్‌లో ఆ సౌండ్ వింటే.. పనిచేస్తున్నప్పుడు వచ్చే సౌండ్‌లా లేదు. ఎవరో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్‌తో మ్యూజిక్ వాయిస్తున్నట్లే ఉంది. కావాలంటే మీరు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ వీడియోను 2ఎక్స్ స్పీడ్‌లో వినండి.. మీకు కూడా మ్యూజిక్‌లా వినిపిస్తోంది.
ఇంతకీ ఆ మేస్త్రీ అక్క ఎవరో తెలుసా.. ఆమె పేరు సవిత. చేసేది సుతారి పనే అయినా పని చేస్తున్నప్పుడు వీడియోలు తీసి, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ఉంటుంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆమెకు సోషల్ మీడియాలో ఏకంగా 6 లక్షల పైనే ఫాలోవర్లు ఉన్నారు. అలాగే యూట్యూబ్ నుంచి ఆమెకు సిల్వర్ బటన్ కూడా వచ్చింది. అయినా కూడా సుతారి పని వదలకుండా చేసుకుంటూ లైఫ్‌ని సంతోషంగా లీడ్ చేస్తోంది. అంత కష్టమైన పనిని హ్యాపీగా చేయడమే కాకుండా.. మగవారికి పోటీ ఇచ్చేలా అంత వేగంగా చేయడం గ్రేట్ అంటూ నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి