Viral: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు

|

Feb 27, 2024 | 11:16 AM

బయటపడిన విగ్రహం, ఆ వస్తువు మహాభారత కాలం నాటివని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ వార్త తెలిసిన తర్వాత, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఒక సర్వే చేయడానికి సిద్ధంగా ఉంది. పచౌమి గ్రామంలో ఇలాంటి ఘటన ఇది మొదటిది కాదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....

Viral: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు
House Excavation (Representative image)
Follow us on

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బరేలీ తాలూకాలో అరుదైన ఘటన వెలుగుచూసింది.  స్థానిక రైతు సత్యపాల్ గత శనివారం సాయంత్రం బరేలీలోని పచౌమి గ్రామంలో తన ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వుతుండగా పురాతన విగ్రహం, కుండ లాంటి వస్తువు  అవశేషాలు బయటపడ్డాయి. అతడిచ్చిన సమాచారంతో జిల్లా అధికారులు ఆదివారం గ్రామానికి చేరుకుని, పరిశీలనలు జరిపిన అనంతరం 1,500 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా అనుమానిస్తున్న ఈ విగ్రహం గురించి భారత పురావస్తు సర్వే (ASI)కి సమాచారం అందించారు. ఈ అవశేషాలు మహాభారత యుగం నాటివని స్థానికులు చెబుతున్నారు. అది ఏ విగ్రహం లాంటి వివరాలు పరిశోధనలో తేలనున్నాయి.  పాండవులు తమ వనవాస సమయంలో ఈ ప్రాంతంలో గడిపారని..  శివాలయాన్ని కూడా కట్టి పూజలు చేశారని అంటున్నారు. పాండవులు శివాలయాన్ని నెలకొల్పినందున ఈ గ్రామానికి ‘పచౌమి’ అని పేరు వచ్చిందని గ్రామస్తులు పేర్కొంటుండగా, చరిత్రకారులకు మరో భిన్నమైన విషయాన్ని చెబుతున్నారు.

శివ, బ్రహ్మ, విష్ణు, శక్తి , సూర్వలను.. ఆ ప్రాంతంలో విసృతంగా ఆరాధించడం కారణంగా పచౌమి పేరు చరిత్రకారులు అనుమానిస్తున్నారు. 2016లో గ్రామానికి ఉత్తరం వైపున, మధ్య వైపున విష్ణు, బ్రహ్మల అరుదైన విగ్రహాలు లభ్యమయ్యాయి. గ్రామానికి ఆగ్నేయంలో శివుని విగ్రహం బయల్పడింది. ఇవే కాదు.. గ్రామస్థులు గుప్తుల కాలం వివిధ పురాతన విగ్రహాలను వివిధ సందర్భాల్లో వెలికితీశారు. 2016లో, మహాత్మా జ్యోతిబాఫూలే.. రోహిల్‌ఖండ్ యూనివర్శిటీ పురాతన, చరిత్ర, సంస్కృతి విభాగం పచౌమి గ్రామంలో తవ్వకాలు నిర్వహించింది. వారు కూడా కొన్ని చారిత్రక మూలాలను కనుగొన్నారు. కాగా ప్రస్తుతానికి సదరు రైతు ఇంటి నిర్మాణం ఆగిపోయింది.  (Source)

Mahabharata Era Idol

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.