Viral Video: చిన్నారి బాలిక మ్యాజిక్ టాలెంట్ .. నెట్టింట్లో వీడియో వైరల్.. 60లకుపైగా లైక్స్ సొంతం

|

Apr 27, 2022 | 5:24 PM

Viral Video: ప్రపంచంలో నైపుణ్యానికి కొదవు లేదు. ప్రతిభావంతులైన పిల్లల వీడియోలు సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతూనే ఉన్నాయి . వీటిలో కొన్నింటిని చూసినప్పుడు.. వెంటనే వీళ్ళు..

Viral Video: చిన్నారి బాలిక మ్యాజిక్ టాలెంట్ .. నెట్టింట్లో వీడియో వైరల్.. 60లకుపైగా లైక్స్ సొంతం
Little Girl Unique Talent
Follow us on

Viral Video: ప్రపంచంలో నైపుణ్యానికి కొదవు లేదు. ప్రతిభావంతులైన పిల్లల వీడియోలు సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతూనే ఉన్నాయి . వీటిలో కొన్నింటిని చూసినప్పుడు.. వెంటనే వీళ్ళు.. పిల్లలా పిడుగులా అంటూ షాక్ తింటారు.   ఎందుకంటే కొన్ని పిల్లల వీడియోలు చాలా అద్భుతంగా,  ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాటిని మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారు.  తాజాగా ఓ చిన్నారి బాలిక వీడియో సోషల్  మీడియాలో హల్ చల్ చేస్తోంది.  ఒక బాలిక తన ప్రత్యేకమైన ప్రతిభతో (Girl Vairl Video) నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది . వీడియో చూసిన తర్వాత, ఈ అమ్మాయి ప్రతిభకు మీరు కూడా ఫిదా అవుతారు.  అమ్మాయి తన ముఖం మీద ముసుగుని మార్చే వేగానికి షాక్ తింటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకి ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

వైరల్‌గా మారిన వీడియోలో ఈ అమ్మాయి వేరే దేశానికి చెందినదని తెలుస్తోంది. ఆదేశ సంప్రదాయ దుస్తుల్లో మాస్క్‌ ధరించిన ఓ అమ్మాయి చుట్టూ కొందరు నిల్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. అమ్మాయి తన ముక్కును తాకమని ముందు నిలబడి ఉన్న స్త్రీని అడుగుతుంది.  ఆ మహిళ బాలిక ముక్కును తాకగానే ముసుగు రంగు మారుతుంది. తర్వాత ముసుగు అదృశ్యమై.. ఆ బాలిక ముఖం కనిపిస్తుంది. అయితే ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.  ఆ అమ్మాయి అద్భుత ప్రతిభను చూసి ఆ మహిళ పక్కనే నిలబడిన వ్యక్తి ఆశ్చర్యపోవడం కూడా వీడియోలో కనిపిస్తోంది.

వీడియో చూద్దాం.

అమ్మాయి అద్భుతమైన ప్రతిభకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సాక్షి_శర్మ_0999 అనే ఖాతాలో షేర్ చేయబడింది.  ‘అమ్మాయి వైఖరిని చూడండి’ అనే క్యాప్షన్ తో వీడియో షేర్ చేశారు.  అయితే బాలికది యాటిట్యూడ్  కాదు, టాలెంట్ అంటారని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు.  ఏప్రిల్ 1న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను 60 లక్షల మందికి పైగా లైక్ చేశారు. రోజు రోజుకీ వీడియోని ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది.    అదే సమయంలో, వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూనే ఉన్నారు.

Also Read: Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!