Viral Video: కింగ్ కోబ్రా, కొండచిలువ మధ్య భీకర పోరాటం.. చివరికి ఎవరు గెలిచారంటే.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

| Edited By: Anil kumar poka

Nov 27, 2021 | 5:57 PM

King Cobra and Python Fight Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అయితే.. వైరల్

Viral Video: కింగ్ కోబ్రా, కొండచిలువ మధ్య భీకర పోరాటం.. చివరికి ఎవరు గెలిచారంటే.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
Viral Video
Follow us on

King Cobra and Python Fight Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అయితే.. వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా జంతువులు, పాములకు సంబంధించినవే ఉంటాయి. అయితే.. సోషల్ మీడియాలో తాజాగా పాత వీడియో ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వీడియో గత సంవత్సరం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిని ఇప్పటివరకు 6 మిలియన్లకు పైగా వీక్షించారు. ఈ 4 నిమిషాల వీడియోలో రెండు పెద్ద పాములు నీటిలో భీకరంగా పోట్లాడుకుంటున్నాయి. చిన్న నీటి కాల్వలో పాముల పోరాటం భీకరంగా ఉంది. నీటి కాల్వలో కొండచిలువలోపాటు కింగ్ కోబ్రా ఎదురెదురుగా తారసపడతాయి. ముందు కింగ్ కోబ్రా.. ఫైథాన్ పై దాడి చేయడంతో ఈ రణరంగం ప్రారంభమవుతుంది. దీంతో రెచ్చిపోయిన రెండు భారీ పాములు ఒకటిపై మరొకటి దాడికి దిగుతాయి. ఈ క్రమంలో కింగ్ కోబ్రా.. కొండచిలువను పలుమార్లు కాటువేస్తుంది. అయితే కొండచిలువ నాగుపామును చుట్టుకొని దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటుంది.

ఈ భీకర పోరాటంలో కొండచిలువ కింగ్ కోబ్రాతో సరిపోలలేదు. కింగ్ కోబ్రా.. కొండచిలువను క్రూరంగా కరుస్తూ దాడిచేస్తుంది. దాదాపు కొన్ని నిమిషాల పాటు వీటి మధ్య భీకర పోరాటం జరుగుతుంది. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన కొండచిలువ.. తన ఓటమిని అంగీకరించి దూరంగా వెళ్లిపోతుంది. చివరికి పాములు కూడా గెలుపోటములను నిర్ధేశించుకొని వేర్వేరు దిశల్లోకి ప్రయాణం సాగిస్తాయి. తాజాగా వైరల్ అయిన ఈ వీడియోను మీరు కూడా ఓ సారి లుక్కేయండి..

వైరల్ వీడియో..

Also Read:

Sand-Meal: అన్నం వద్దు ఇసుక ముద్దు అంటున్న బామ్మ.. గత 60ఏళ్లుగా ఇసుకే భోజనం.. రోజుకి ఎంత తింటుందో తెలిస్తే షాక్..

Viral News: ఆఫీసులో ఫోన్‌ చార్జింగ్‌ చేసుకోవడం.. విద్యుత్‌ను దొంగలించడమే. జీతం కట్.. వైరల్‌ అవుతోన్న నోటీస్‌..