Abu Dhabi: లక్ తెచ్చిన లాటరీ టికెట్.. లక్కీడ్రాలో 44 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న కేరళ యువతి.. 

Abu Dhabi: అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలీదు. ఇదిగో ఓ కేరళ యువతి(Kerala Women) కూడా తన అదృష్టం పండి ఒక్కసారిగా కోటీశ్వరురాలైపోయింది. కేరళ త్రిశూర్‌ జిల్లాలోని..

Abu Dhabi: లక్ తెచ్చిన లాటరీ టికెట్.. లక్కీడ్రాలో 44 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న కేరళ యువతి.. 
Kerala Women

Updated on: Feb 06, 2022 | 10:14 AM

Abu Dhabi: అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలీదు. ఇదిగో ఓ కేరళ యువతి(Kerala Women) కూడా తన అదృష్టం పండి ఒక్కసారిగా కోటీశ్వరురాలైపోయింది. కేరళ త్రిశూర్‌ జిల్లాలోని అంజన్‌గడి ప్రాంతానికి చెందిన లీనా జలాల్‌ అబుదాబిలోలని ఓ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె అబుదాబి వీక్లీ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ఈ నెల 3వ తేదీన లక్కీ డ్రా తీయగా వీక్లీ డ్రాలో 22 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకుంది. లీనా జలాల్ కొనుగోలు చేసిన టికెట్ కు 44 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. అయితే, ఆ టికెట్ ను ఆమె తనతో పాటు ఆఫీసులో పనిచేసే మరో తొమ్మిది మందితో కలిసి కొనుగోలు చేసింది. దాంతో, ఆ ప్రైజ్ మనీని ఇప్పుడు వారందరూ పంచుకోనున్నారు. అయినప్పటికీ, ఒక్కొక్కరికి 4 కోట్లు దాకా వస్తుంది.

దీనిపై లీనా జలాల్ మాట్లాడుతూ, తన మిత్రులతో కలిసి గత ఏడాది కాలంగా లాటరీ టికెట్లు కొంటున్నానని, లాటరీ తగలడం ఇదే మొదటిసారి అని సంతోషం వ్యక్తం చేశారు. తాము కొనుగోలు చేసిన టికెట్ కు ఇంత పెద్ద మొత్తం లాటరీ తగిలిందని చెప్పగానే మొదట నమ్మలేకపోయానని, తనకు మాటలు రావడంలేదని, దేవుడికి రుణపడి ఉంటానంటూ చెప్పుకొచ్చారు. కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నానని లీనా చెప్పింది.

Also Read:  వింటర్ ఒలింపిక్స్ వేడుకలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కునుకు తీసిన వేళ..

Loading...
Unable to load recommendations.
Follow Us