Viral Video: రైల్వే స్టేషన్‌లో యాచకురాలిగా కాలం దీసే రాను మండల్( Ranu Mondal ) ఒక్కపాటతో ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిపోయింది. పశ్చిమ బెంగాల్‌లోని(West Bengal) రాణాఘాట్ రైల్వేస్టేషన్‌లో పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసుకునే రాను మండల్ ఒకే ఒక్క వీడియో వైరల్ కావడంతో ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కట్టాయి. బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేషమ్మియా .. తాను నటించి కంపోజ్ చేసిన ‘తేరీ మేరీ కహానీ’లో రాను మండల్‌తో మూడు పాటలు పాడించారు. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. కరోనా సమయంలో ఎక్కడుందో.. ఏం చేస్తుందో కూడా తెలియలేదు. అయితే మళ్ళీ గత కొంతకాలంగా పాపులర్ సాంగ్స్ కు రీల్స్ చేస్తూ.. మళ్ళీ సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. పుష్ప లో సాంగ్, కచ్చ బాదామీ సాంగ్ రీల్స్ తో మళ్ళీ సందడి చేసింది. తాజాగా ఓ బంగ్లాదేశ్ పాటతో రాను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బంగ్లాదేశ్ సూపర్‌స్టార్ హీరో ఆలం నటిస్తున్న ఓ సినిమాలో రాను మండల్ పాట పాడింది. తన సినిమాలోని ‘తుమీ చారా అమీ’ అనే పాట రికార్డింగ్‌కు సంబంధించిన వీడియోను ఆలం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆలం, రాను మండల్ ఇద్దరూ కలిసి పాట పాడారు. ఇద్దరూ ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ, చిరునవ్వులు చిందిస్తూ మెలొడీ పాటను పాడారు. ఈ వీడియో చూసిన అనేకమంది ‘వెల్ కం బ్యాక్ మండల్’ అంటూ కామెంట్ చేశారు. కాగా, పలువురు ఆమెను ట్రోల్ కూడా చేశారు. ఏది ఏమైనా రాను మండల్ తన గొంతుతో మళ్లీ మెరిసింది.
Also Read: Viral Video: ఆవుదూడపై కొండచిలువ దాడి.. సాయం మరచి వీడియో తీస్తున్న వ్యక్తి.. మండిపడుతున్న నెటిజన్లు