Viral: ఇన్‌స్టాలో అమ్మాయిని ప్రేమించాడు.. డబ్బులిచ్చి ఆదుకున్నాడు.. ఇంతలో సీన్ రివర్సయింది.!

|

Aug 01, 2022 | 8:15 PM

ఆ యువకుడు గత కొద్దిరోజులుగా ఇన్‌స్టాలో పరిచయమైన అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు. ఆపై పరిచయం కాస్తా..

Viral: ఇన్‌స్టాలో అమ్మాయిని ప్రేమించాడు.. డబ్బులిచ్చి ఆదుకున్నాడు.. ఇంతలో సీన్ రివర్సయింది.!
Instagram
Follow us on

ఆ యువకుడు గత కొద్దిరోజులుగా ఇన్‌స్టాలో పరిచయమైన అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు. ఆపై పరిచయం కాస్తా అతడికి ప్రేమగా మారింది. సీన్ కట్ చేస్తే.. ఇన్‌స్టా అమ్మాయి ఆపదలో ఉందని తెలియడంతో డబ్బులిచ్చి ఆదుకున్నాడు. అయితే ఇంతలోనే సీన్ కాస్తా రివర్సయింది.. అసలేం జరిగిందంటే..!

వివరాల్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన 18 ఏళ్ల నిఖిల్ కుమార్ ఏడాది కాలంగా నేహ రాజ్‌పుత్‌ అనే యువతితో ఇన్‌స్టా వేదికగా చాట్ చేస్తున్నాడు. ఇక ఆమెతో ఏర్పడిన పరిచయం కాస్తా అతడికి ప్రేమగా మారింది. అందుకేనేమో.. ఇతగాడు ప్రేమ నుంచి పెళ్లి వరకు ఎన్నో విషయాలను ఆమెతో పంచుకున్నాడు. ఇద్దరూ మొబైల్ నెంబర్స్ కూడా మార్చుకున్నారు.

నేహా మాత్రం నిఖిల్‌కు ఎప్పుడూ కాల్ చేయలేదు గానీ.. నిఖిల్ మాత్రం ఆమెకు తరచూ కాల్ చేసేవాడు. అయితే ఆ యువతి అతడి కాల్స్ లిఫ్ట్ చేసేది కాదు.. అంతేకాకుండా చాట్ చేస్తున్న సమయంలో ఆమె.. తన తండ్రితో విదేశాలకు వెళ్లినట్లుగా చెబుతుండేది. ఇంతవరకు బాగానే ఉంది కదా.! అయితే కథలో ట్విస్ట్ ఇప్పుడు వస్తది.

ఇవి కూడా చదవండి

తన తల్లి కాలుకి ఫ్రాక్చర్ అయిందని.. ప్రస్తుతం ఐసీయూలో సీరియస్ కండిషన్‌లో ఉందని.. డబ్బులు సాయం చేయమంటూ ఒకానొక రోజున ఆ యువతి.. నిఖిల్‌కు మెసేజ్ పెట్టింది. మనోడేమో ప్రియురాలు కష్టాల్లో ఉందనుకుని.. తల్లిదండ్రులకు తెలియకుండా రూ. 5 లక్షలు ఆమె అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అంతే! ఆ యువతి ఇన్‌స్టా ఖాతా డీయాక్టివ్.. మొబైల్ స్విచాఫ్ అయిపోయింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కాగా, అతడిచ్చిన ఫిర్యాదు మేరకు ఖాకీలు కేసు నమోదు చేసి మొబైల్ నెంబర్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..