Video : ఇండోనేషియా రాయబార కార్యాలయం.. ‘దేవి’ AI అవతార్‌ పరిచయం

జకార్తాలోని భారత రాయబార కార్యాలయం ‘దేవి’ పేరుతో ఓ AI అవతార్‌ను పరిచయం చేసింది. కాన్సులర్‌ సేవలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని 'దేవి' అందిస్తుంది. నవరాత్రి, దుర్గాపూజ శుభ సమయాన్ని పురస్కరించుకుని ‘దేవి’ AI అవతార్‌ను పరిచయం చేసినట్లు భారత రాయబారి సందీప్ చక్రవర్తి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసారు.

Video : ఇండోనేషియా రాయబార కార్యాలయం.. దేవి’ AI అవతార్‌ పరిచయం
Indian Embassy In Indonesia Introduces Ai Avatar Dewi

Updated on: Oct 14, 2026 | 10:05 AM

సాంకేతికత ఆధారిత పాలనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాధాన్యానికి అనుగుణంగా ఈ తరహా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులకు సకాలంలో కాన్సులర్‌ సేవలు అందించడం కీలకం. పాస్‌పోర్టుల జారీ, వీసాల ప్రాసెసింగ్‌, ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (OCI) సేవలు, జననాల నమోదు వంటి అవసరాల కోసం విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు భారత దౌత్య కార్యాలయాలపై ఆధారపడుతున్నారు. ఈ సేవలను వేగంగా, సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో డిజిటల్‌ సాంకేతికత, కృత్రిమ మేధ (AI) కీలకంగా మారింది.

మ్యూనిచ్‌లో ‘సారథి’తో సరికొత్త ప్రయత్నం!

భారతీయ ప్రవాసులకు తక్షణ సమాచారం, సహాయం అందించేందుకు భారత దౌత్య కార్యాలయాలు ‘భారతి’ (Bharati), ‘ప్రమిత్‌’ (Pramit) వంటి చాట్‌బాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, కాన్సులర్‌ సేవలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఈ డిజిటల్‌ సాధనాలు ఉపయోగపడుతున్నాయి. భారత సంస్కృతి, పర్యాటకం, విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌లు, వ్యాపారం, పెట్టుబడి అవకాశాలను,  AI ఆధారిత చాట్‌బాట్‌లు సమాచారాన్ని వేగంగా అందిస్తూ, దౌత్య సేవలను మరింత సులభంగా ప్రజలకు చేరువ చేస్తున్నాయి.  జర్మనీ మ్యూనిచ్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ఇటీవల ‘సారథి’ (Sarathi) పేరుతో AI అవతార్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

విదేశాల్లోని భారతీయులకు AI సేవలు

తాజాగా జకార్తాలోని భారత రాయబార కార్యాలయం ‘దేవి’ AI అవతార్‌ను పరిచయం చేసింది. కాన్సులర్‌ సేవలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ‘దేవి’ అందిస్తుంది. నవరాత్రి, దుర్గాపూజ శుభ సమయాన్ని పురస్కరించుకుని ‘దేవి’ AI అవతార్‌ను పరిచయం చేసినట్లు భారత రాయబారి సందీప్ చక్రవర్తి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసారు. తాజా అప్‌డేట్స్‌ కోసం తమ సోషల్ మీడియా ఖాతాను ఫాలో కావాలని కోరారు. 2014 నుంచి భారత్‌ అనుసరిస్తున్న ‘యాక్ట్‌ ఈస్ట్‌’ విధానం నేపథ్యంలో భారత్‌, ఇండోనేషియా మధ్య రాజకీయ, భద్రత, రక్షణ, వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us