Viral Video: టుక్.. టుక్.. టుక్.. ఏటీఎం నుంచి మనీ వస్తున్నాయ్.. ఆనందంలో ఆ అమ్మాయి డ్యాన్స్ చూడండి

|

Oct 03, 2021 | 3:33 PM

ఏటీఎమ్‌లో నుంచి డబ్బులు బయటకు వస్తోన్న టుక్.. టుక్.. టుక్ సౌండ్ వింటే ఎవరికి ఆనందంగా ఉండదు చెప్పంది. అది ప్రతి ఒక్కరూ హ్యపీ ఫీలయ్యే మూమెంట్.

Viral Video: టుక్.. టుక్.. టుక్.. ఏటీఎం నుంచి మనీ వస్తున్నాయ్.. ఆనందంలో ఆ అమ్మాయి డ్యాన్స్ చూడండి
Money From Atm
Follow us on

ఏటీఎమ్‌లో నుంచి డబ్బులు బయటకు వస్తోన్న టుక్.. టుక్.. టుక్ సౌండ్ వింటే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు చెప్పంది. అది ప్రతి ఒక్కరూ హ్యపీ ఫీలయ్యే మూమెంట్. నెలంతా కష్టపడి పనిచేశాక.. శాలరీ పడ్డ అనంతరం.. ఆ అమౌంట్‌ను విత్ డ్రా చేస్తుంటే ఆ కిక్కే వేరప్పా. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. సదరు వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మనీ డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన ఓ అమ్మాయి.. ట్రాన్సాక్షన్ ప్రాసెస్ జరుగుతోన్న సమయంలో.. ఆ ఆనందం పట్టలేక డ్యాన్స్ మూవ్స్‌ చేసింది. కాసేపు ఈ ప్రపంచాన్ని మరిచిపోయి.. ఖతార్నాక్ స్టెప్పులతో ఎంజాయ్ చేసింది. సీసీ కెమెరాలో రికార్డయిన సదరు వీడియో.. ఇంటర్నెట్‌లో అప్లోడ్ చేయడంతో తెగ ట్రెండ్ అవుతోంది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఏటీఎం మిషన్ వద్ద అమ్మాయి సంతోషంతో డ్యాన్స్ చేస్తున్న వీడియోను ‘ghantaa‘ అనే  ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి అప్‌లోడ్ చేశారు. “ఖుషి దేఖ్ రహే హో సాలరీ కి” అనే క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఈ వీడియో అప్‌లోడ్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

బ్లాక్ టాప్, బ్లాక్ ఫేస్ మాస్క్ డ్యాన్స్ ధరించిన ఒక అమ్మాయి ATM సెంటర్ లోపల నిలబడి, కొంత డబ్బు విత్‌డ్రా చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆమె ATM మెషీన్ ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు, డ్యాన్స్ చేయడం మీరు చూడవచ్చు. డబ్బు మెషీన్ నుంచి బయటకు రాగానే ఆమె ఇంకాస్త యాక్టివ్‌గా స్టెప్పులు వేసింది. డబ్బులు తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి ATM మెషీన్‌కు నమస్కరించి, చేతులు జోడించి కృతజ్ఞతలు తెలపడం కూడా చూడవచ్చు.

Also Read: సిద్దార్థ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. తన మార్క్ కామెంట్.. అంతా గందరగోళం

 నర్మగర్భంగా మరో పోస్ట్ పెట్టిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌.. నెట్టింట వైరల్