Viral Photo: హలో బాస్! ఓన్లీ 10 సెకన్లు.. ఈ ఫోటోలో జీబ్రాను కనిపెట్టగలరా.? జస్ట్ ట్రై!

ఫన్‌కు కేరాఫ్ అడ్రెస్ ఇంటర్నెట్. మీమ్స్, వీడియోలు, కామెడీ సీన్స్ మాత్రమే కాదు.. మనలో చురుకుదనాన్ని..

Viral Photo: హలో బాస్! ఓన్లీ 10 సెకన్లు.. ఈ ఫోటోలో జీబ్రాను కనిపెట్టగలరా.? జస్ట్ ట్రై!
Elephant Viral Photo

Updated on: Sep 20, 2022 | 5:38 PM

ఫన్‌కు కేరాఫ్ అడ్రెస్ ఇంటర్నెట్. మీమ్స్, వీడియోలు, కామెడీ సీన్స్ మాత్రమే కాదు.. మనలో చురుకుదనాన్ని పెంపొందించేందుకు సుడోకోలు, ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా ఉన్నాయి. రోజుకో సరికొత్త ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం నెటిజన్లను పలకరిస్తోంది. వాళ్లల్లో కూడా ఆసక్తి ఏమాత్రం తగ్గట్లేదు.. ఎంత క్లిష్టమైనవి అయినా.. తగ్గేదేలే అన్నట్లు ఓ పట్టు పడుతున్నారు. సింపుల్ పజిల్స్ పెద్దగా ఇబ్బంది పెట్టవు. కాని కష్టమైన, గమ్మత్తైన పజిల్స్.. సాల్వ్ చేసేటప్పుడు మనలో మనకే తెలియని ఓ థ్రిల్ కలుగుతుంది. మరి లేట్ ఎందుకు తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం..

పైన పేర్కొన్న ఫోటోను నిశితంగా పరిశీలించండి.. అందులో ఏం కనిపిస్తోంది.. గజరాజుల సమూహం అని ఎవ్వరైనా చెప్పేస్తారు. అయితే తీక్షణంగా ఫోటోను చూడండి మరోసారి.. ఆ ఏనుగులతో పాటు ఓ జీబ్రా కూడా ఉంది. అదెక్కడుందో కనిపెట్టాలి. మీ కళ్లకు పదునుపెట్టండి.. ఆ జీబ్రాను కనిపెట్టండి.. ఫస్ట్ అటెంప్ట్‌లోనే గుర్తిస్తే.. మీవి డేగ కళ్లు అనమాట. ఒకవేళ ఫెయిల్ అయ్యారో.. ఆ జీబ్రాను గుర్తించాలంటే.. కింద ఫోటోపై ఓ లుక్కేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us