Viral Video: నీళ్లు రావడం లేదని వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసిన ఓనర్.. కట్‌చేస్తే.. లోపల సీన్ చూసి గుండె గుభేల్..

Snakes Found in Water Tank: సరిగ్గా వర్షాకాలం ప్రారంభం అవుతున్న సమయంలో ఇటువంటి ఘటనలు జరగడం పట్ల అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇళ్ల చుట్టుపక్కల ఉండే నీటి ట్యాంకులు, నిల్వ ఉంచే డ్రమ్ములపై మూతలు కచ్చితంగా, గట్టిగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, తాగే నీటి ట్యాంకులో అన్ని పాములు ప్రత్యక్షం కావడం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది.

Viral Video: నీళ్లు రావడం లేదని వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసిన ఓనర్.. కట్‌చేస్తే.. లోపల సీన్ చూసి గుండె గుభేల్..
Snakes Found In Water Tank

Updated on: Jun 09, 2026 | 2:16 PM

Snakes Found in Water Tank: మనం నిత్యం తాగేందుకు, ఇంటి అవసరాలకు ఉపయోగించే నీటి ట్యాంకులో ఏముంటుంది? మహా అయితే కొద్దిగా బురద లేదా నాచు ఉంటుంది. కానీ, ఉత్తరాఖండ్‌లోని ఒక ఇంట్లో వాటర్ ట్యాంక్ తెరిచి చూసిన కుటుంబ సభ్యులకు మాత్రం గుండె ఆగిపోయే అంత పని అయింది. ఆ ట్యాంకు లోపల ఏకంగా డజన్ల కొద్దీ పాము పిల్లలు ఈదుకుంటూ కనిపించాయి.

నీటి తొట్టెలో వింత కదలికలు.. తీరా చూస్తే..!

ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లా పరిధిలోని సరాయ్ గ్రామంలో ఈ ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఒక కుటుంబం తమ ఇంటి నీటి నిల్వ ట్యాంకును సాధారణంగానే పరిశీలించింది. అయితే, ట్యాంకు లోపల ఏదో వింతగా కదులుతున్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు, నిశితంగా లోపలికి తొంగి చూశారు. అంతే.. అక్కడ కనిపించిన దృశ్యానికి వారి నోట మాట రాలేదు, ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. చిన్న చిన్న పాము పిల్లలు గుంపులుగా ఆ నీటిలోనే తిరుగుతూ కనిపించాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ కుటుంబం వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది.

రంగంలోకి దిగిన అటవీ శాఖ, స్నేక్ క్యాచర్లు..

ఇంట్లో పాములు ఉన్నాయన్న వార్త లంక దహనంలా గ్రామం మొత్తం వ్యాపించింది. దాంతో విషయాన్ని తీవ్రంగా పరిగణించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులను ఆశ్రయించారు. పరిస్థితిని అర్ధం చేసుకున్న రేంజ్ ఆఫీసర్ శిశ్‌పాల్ సింగ్ తన సిబ్బందితో పాటు తాలిబ్, భోలా అనే నైపుణ్యం గల ఇద్దరు పాములు పట్టే నిపుణులను వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిపుణులు అత్యంత జాగ్రత్తగా ఆ నీటి ట్యాంకు లోపల ఉన్న పాములను ఒక్కొక్కటిగా బయటకు తీసే ప్రక్రియను ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఊరంతా ఒకటే గుంపు.. ఊపిరి పీల్చుకున్న జనం..

ఈ అరుదైన రెస్క్యూ ఆపరేషన్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. ఆ ఇంటి ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. స్నేక్ క్యాచర్లు అలుపెరగకుండా శ్రమించి, ఆ నీటి ట్యాంకు నుండి ఏకంగా 27 పాము పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. ఒకే చిన్న వాటర్ ట్యాంకులో ఇన్ని పాములు ఎలా చేరాయబ్బా అంటూ స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. కాగా, ఈ ఆపరేషన్‌లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, పట్టుబడిన పాము పిల్లలన్నింటినీ అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టామని అధికారులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాంక్‌లో పాముల వీడియో..

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us