మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే కనిపించకుండా పోయిన వరుడు.. పొదల మాటున చూడగా..!

|

Jul 16, 2024 | 3:39 PM

ప్రవేశ్‌కుమార్‌కు పొరుగు గ్రామానికి చెందిన యువతితో వివాహనం నిశ్చయించారు. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు. పెళ్లి రోజున వరుడు సహా అతని స్నేహితులు బంధువులంతా అమ్మాయి గ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలోనే కాలకృత్యాలు తీర్చుకోవటం కోసం ఓ పొద దగ్గరికి వెళ్లాడు వరుడు. అలా వెళ్లిన అతడు ఎంత సేపపటికీ తిరిగి రాకపోవడంతో అందరూ వెతకటం మొదలుపెట్టారు. చుట్టుపక్కల అంతా చూశారు. చివరకు చెట్ల పొదలమాటుకు వెళ్లి చూడగా,..

మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే కనిపించకుండా పోయిన వరుడు.. పొదల మాటున చూడగా..!
Groom Died By Snake Bite
Follow us on

అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా వరుడు కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు అంతా వెతికారు. చివరకు సమీపంలోని పొదల్లో అపస్మారక స్థితిలో కనిపించాడు పెళ్లి కుమారుడు. అది చూసిన కుటుంబీకులు, బంధువులు టెన్షన్ పడిపోయారు. ఏం జరిగిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. దీంతో సంతోషంతో నిండిన ఆ పెళ్లింట ఒక్కక్షణంలో విషాదం అలుముకుంది. మంగళవాయిద్యాలు మోగుతున్న ఆ పెళ్లి పందిరిలో రోదనలు మిన్నంటాయి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది..? ఉన్నట్టుండి పెళ్లికుమారుడు ఎలా మరణించాడు.. అనే వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షర్ జిల్లాలో జరిగింది ఈ విషాద సంఘటన. జిల్లాలోని అగర్బస్ గ్రామానికి చెందిన ప్రవేశ్‌కుమార్‌కు పొరుగు గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు. పెళ్లి రోజున వరుడు సహా అతని స్నేహితులు, బంధువులంతా అమ్మాయి గ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలోనే కాలకృత్యాలు తీర్చుకోవటం కోసం ఓ పొద దగ్గరికి వెళ్లాడు వరుడు. అలా వెళ్లిన అతడు ఎంత సేపపటికీ తిరిగి రాకపోవడంతో అందరూ వెతకటం మొదలుపెట్టారు. చుట్టుపక్కల అంతా చూశారు. చివరకు చెట్ల పొదలమాటుకు వెళ్లి చూడగా, అప్పటికే అతను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అతను చనిపోయినట్టుగా చెప్పాడు. ఈ విషయం తెలిసి పెళ్లికి వచ్చిన వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇదిలా ఉంటే, బులంద్‌షహర్ జిల్లాలో గత రెండు నెలల్లో పాము కాటు కారణంగా ఏడుగురు మరణించారని స్థానికులు చెబుతున్నారు.. గత వారంలో బులంద్‌షహర్‌లోని ఛతారీ ప్రాంతంలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలు సహా ఆమె మనవడు పాము కాటుతో మరణించారు. పాము కాటుకు గురైనప్పుడు ప్రజలు భయపడవద్దని, బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని దిబాయిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ సీనియర్ వైద్యుడు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ-వెనమ్ వ్యాక్సిన్, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయని.. వర్షాకాలంలో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..