Viral Video: పెళ్లి దుస్తుల్లో కళ్లముందు తళుక్కుమన్న స్వప్న సుందరి.. బోరున ఏడ్చిన వరుడు.. ఫన్నీ వీడియో మీకోసం..!

|

Dec 04, 2021 | 6:09 AM

Viral Video: ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి భార్య కావడంకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి.. అలా తాను ప్రేమించిన అమ్మాయి నవ వధువుగా ముస్తాబై తన చేయందుకోడానికి రావడంతో..

Viral Video: పెళ్లి దుస్తుల్లో కళ్లముందు తళుక్కుమన్న స్వప్న సుందరి.. బోరున ఏడ్చిన వరుడు.. ఫన్నీ వీడియో మీకోసం..!
Marriage
Follow us on

Viral Video: ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి భార్య కావడంకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి.. అలా తాను ప్రేమించిన అమ్మాయి నవ వధువుగా ముస్తాబై తన చేయందుకోడానికి రావడంతో.. ఆ పెళ్లి కొడుకు ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. అసలేం జరిగిందంటే..

వైరల్‌ అవుతున్న వీ వీడియోలో పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న వధువును చూసి వరుడు భావోధ్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం.. బ్యూటిఫుల్‌ వైట్‌ పెవిలియన్‌ గౌను ధరించిన వధువు పుష్పగుచ్చం పట్టుకుని తండ్రితోపాటు నడుచుకుంటూ వస్తుంది. వధువును చూసిన వరుడు తన కన్నీళ్లను ఆపుకోలేకపోతాడు. బోరున విలపిస్తాడు. దీనికి సంబంధించిన వీడియోను మగ్నోలియా రోడ్‌ ఫిల్మ్‌ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో అధికాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఓమై గాడ్‌! ఈ వీడియో నన్ను కూడా ఏడిపిస్తోంది. మీకు శుభాకాంక్షలు’ అని కొందరు, ‘ఈ వీడియో నిజమైన ప్రేమను తెలియజేస్తుంది. మీరిద్దరు చాలా అందంగా ఉన్నారు.. మీరెవరో నాకు తెలియకపోయినా.. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చాలా భావోధ్వేగంతో కామెంట్‌ చేశారు.

Viral Video:

Also read:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!