Viral Video: మాల్‏లో అబ్బాయిని పొట్టుపొట్టుగా కొట్టిన అమ్మాయి.. ఏకంగా పూల కుండిలతో దాడి.. చివరకు..

|

Jul 23, 2022 | 1:01 PM

ఏకంగా ఓ అబ్బాయిపై తీవ్రంగా దాడి చేసింది  అమ్మాయి. అందరూ చూస్తుండగానే ఆ యువకుడిపైకి గొడవకు వెళ్లింది. అంతేకాదు

Viral Video: మాల్‏లో అబ్బాయిని పొట్టుపొట్టుగా కొట్టిన అమ్మాయి.. ఏకంగా పూల కుండిలతో దాడి.. చివరకు..
Viral Video
Follow us on

గత కొద్ది రోజుల క్రితం ఇద్దరు కాలేజీ అమ్మాయిలు నడిరోడ్డుపై పొట్టు పొట్టుగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. వారిద్దరి ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ తగ్గేదే..లే అన్నట్టుగా కొట్టుకున్నారు. ఇక ఈమధ్య మరో ఇద్దరు అమ్మాయిలు కాలేజీలో.. రైల్వే స్టేషన్‏లో కొట్టుకున్న వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇక్కడ ఎక్కువగా అమ్మాయిలు కొట్టుకున్నది మాత్రం తమ బాయ్ ఫ్రెండ్స్ కోసమే. కానీ ఇప్పుడు యువతులు కాదు.. ఏకంగా ఓ అబ్బాయిపై తీవ్రంగా దాడి చేసింది  అమ్మాయి. అందరూ చూస్తుండగానే ఆ యువకుడిపైకి గొడవకు వెళ్లింది. అంతేకాదు అతడి పైకి పూల కుండిలను విసిరింది. అక్కడే ఉన్న స్థానికులు ఆపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ అమ్మాయి ఉగ్రరూపం దాల్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఉత్తర ప్రదేశ్ లోని సమ్మిట్ బిల్డింగ్ లో ఉన్న ఓ బార్ బయట ఓ అబ్బాయిపై యువతి దాడి చేసింది. అతడిని కొడుతూ రచ్చ చేసింది. ఆ అమ్మాయితో ఉన్న మరో యువతి ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె ఆగలేదు. పక్కనే ఉన్న పూల కుండిలను ఆ యువకుడిపైకి విసురుతూ దాడి చేసింది. బార్ బయటే ఉన్న బౌన్సర్స్ వెంటనే వచ్చి ఆ అమ్మాయిని ఆపి.. ఆ యువకుడిని పక్కనే ఉన్న మరో రూంలోకి పంపించారు. మరికొందరు ఆ యువతిని బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అయితే ఈ ఘటన పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు పోలీసులు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ యువతి, యువకుడు కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే బార్ లోని బౌన్సర్లను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. దాడి జరిగిన సమయంలో సదరు యువతి మద్య మత్తులో ఉన్నట్లుగా అనుమానిస్తు్న్నారు పోలీసులు. గతంలో ఆ బార్ లో అనేక గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో యువకులు, యువతులపై ఇలాంటి ఘటనలు అనేకం జరిగినట్లు వెలుగులోకి వస్తున్నాయి. బార్ లో గొడవ చేసిన యువతి, యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.