కల్తీ నెయ్యి గుట్టు…ఇలా కనిపెట్టు.. మీ ఇంట్లోనే తెలుసుకోవచ్చు

మీరు తింటున్న నెయ్యి మంచిదో కాదో ఎలా తెలుసుకోవాలి? దేశంలో వినియోగంలో ఉన్న నెయ్యిలో 40 శాతం కల్తీనే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఫెస్టివల్‌ సీజన్‌లో అది 60శాతానికి చేరుతోందట. దీంతో ప్రజలు కల్తీ నెయ్యి బారినపడకుండా ఉండేందుకు, FSSAI ఓ వీడియోను విడుదల చేసింది. దానిలో వివరించిన స్టెప్స్‌ ఫాలో అయితే చాలు... మీరు తినే నెయ్యిలో, ఏదైనా కల్తీ జరిగిందో లేదో తెలిసిపోతుంది.

కల్తీ నెయ్యి గుట్టు...ఇలా కనిపెట్టు.. మీ ఇంట్లోనే తెలుసుకోవచ్చు
Ghee Purity Test

Updated on: Jun 20, 2026 | 9:22 PM

గల్లీ నుంచి ఢిల్లీ దాకా, కల్తీ ఘీంకారాలు వినిపించని రోజే లేదు. కనిపించని ఊరే లేదు. నీచ్‌ కమినే కల్తీగాళ్లు…కల్తీ చెయ్యని ఆహార పదార్థాలే లేవు. అసలేదో, నకిలీ ఏదో తెలియనంతగా కేటుగాళ్లు జనాన్ని మోసం చేస్తున్నారు. ఇక కంచంలో వేసుకున్న నెయ్యి తింటే…మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు అయిపోయింది పరిస్థితి.

చౌక రకం వనస్పతి లేదా ఎడిబుల్‌ ఫ్యాట్‌తో నెయ్యిలో కల్తీ

వాయిస్‌: భోజనంలో నెయ్యి లేనిదే చాలామందికి ముద్ద దిగదు. అయితే కల్తీ కాలం కమ్మేసిన వేళ…మనం తింటున్న నెయ్యి మంచిదేనా? లేక దానిలో ఏదైనా కల్తీ జరిగిందా అనే అనుమానం చాలామందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈ బేతాళ ప్రశ్నకు సమాధానం దొరక్క, ఘీ వాడాలా వద్దా అనేది నిర్ణయించుకోలేక జనం సతమతమైపోతున్నారు. కొందరైతే నెయ్యి వాడకమే మానేశారు. సాధారణంగా నెయ్యిలో చౌక రకం వనస్పతి లేదా హైడ్రోజనేటెడ్‌ ఎడిబుల్‌ ఫ్యాట్‌ కలిపి కల్తీ చేస్తారు. అయితే కల్తీ నెయ్యిని ఎలా కనిపెట్టాలి అనేదానిపై ఓ వీడియోను ఫుడ్ సేఫ్టీ అథారిటీ విడుదల చేసింది. దానిలో కల్తీ నెయ్యిని ఎలా కనిపెట్టాలో వివరించారు.

ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారితే కల్తీ జరిగినట్టే!

1 ఎంల్‌ నెయ్యిని కరిగించి, దాన్ని టెస్ట్‌ ట్యూబ్‌లోకి తీసుకోవాలి. దానిలో 1 ఎంఎల్ కాన్‌సెంట్రేటెడ్‌ హైడ్రో క్లోరిక్‌ యాసిడ్‌ని కలపాలి. ఆ మిశ్రమానికి అర చెంచా పంచదారను జత చేయాలి. ఆ తర్వాత టెస్ట్ ట్యూబ్‌ని రెండు నిమిషాల పాటు బాగా షేక్‌ చేయాలి. ఆ మిశ్రమం ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారితే అందులో కల్తీ జరిగినట్లేనని నిర్ధారించుకోవచ్చు. నెయ్యిలో కల్తీ లేకపోతే రంగు మార్పు ఉండదు. ఈ చిట్కాతో కల్తీ నెయ్యి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

టెస్ట్ వీడియోను దిగువన చూడండి…

Follow Us