ఇటీవల ఫుడ్ ఐటెమ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫుడ్ బిజినెస్ చేసేవారు.. తమ వ్యాపార సంస్థకు సంబంధించిన వీడియోలు… చేసే ఆహారపదార్థాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమ వ్యాపారన్ని అభివృద్ధి చేసుకోవడానికి వివిధ రకాల వంటలను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐస్ క్రీమ్ దోశ, పెరుగు, చట్నీ రసగుల్లా చాట్ వంటి ఆహారాలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే వాటి టేస్ట్ ఎలా ఉందో తెలియదు కాదు.. అక్కడకు వెళ్ళిన ప్రతి ఒక్కరు వావ్.. సూపర్బ్ అంటూ వీడియోస్ పెట్టడం చేస్తుంటారు. అయితే ఇటీవల గత కొద్ది రోజులుగా సెవ్, పెరుగు, చట్నీలతో చేసిన రసగుల్లా చాట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ రసగుల్లా చాట్‌ను రుచి చూసేందుకు ఓ ఫుడ్ బ్లాగర్ అక్కడకు వెళ్లారు. తొలిసారిగా ఆమె టిక్కీ రసగుల్లా చాట్ ను టేస్ట్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె టిక్కీ రసగుల్లా చాట్‌ను తినగానే ఒక్కసారిగా తన ముఖం మారిపోయింది. 140 రూపాయాలు పెట్టి కొనుగోలు చేసినందుకు ఆమె నిరాశ వ్యక్తం చేసింది. తను అనుకున్నంత రుచిగా ఆ రసగుల్లా చాట్ లేదని తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఇలాంటి స్వీట్ ఫుడ్స్ అస్సలు ట్రై చేయ్యొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Also Read: Drishyam 2: దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. మరోసారి సస్పెన్స్ అదిరిపోయిందిగా..
Kamal Haasan: భారీ మల్టీస్టారర్ నిర్మించేందుకు సిద్ధమైన కమల్ హాసన్.. ఆ స్టార్ హీరోలెవరంటే..
Samantha in Pushpa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. పుష్పరాజ్‌తో స్టెప్పులేయనున్న సమంత…
Radhe Shyam: రాధేశ్యామ్ చిత్రయూనిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నిద్రపోతున్నావా అంటూ కామెంట్స్..