ఒంటరిగా ఉన్నారా? ఫిన్లాండ్‌కు ఫ్రీగా వెళ్లి ప్రేమను వెతుక్కోండి!

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుగాంచిన ఫిన్లాండ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సింగిల్స్ కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ఫిన్నిష్ టూరిజం బోర్డు విజిట్ ఫిన్లాండ్ ఆధ్వర్యంలో ఫిన్నిష్ డిన్నర్ డేట్ పేరిట ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రపంచం నలుమూలల నుండి 16 మంది ఒంటరి వ్యక్తులను ఉచిత ప్రయాణం కోసం ఎంపిక చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 నుండి 19 మధ్య జరిగే ఈ పర్యటనలో, ఎంపికైన వారు ఫిన్లాండ్ ఆహార సంస్కృతిని ఆస్వాదిస్తూ, స్థానిక సింగిల్స్‌తో ప్రత్యేక డిన్నర్ డేట్లలో పాల్గొనవచ్చు. ప్రయాణ, వసతి ఖర్చులన్నీ టూరిజం బోర్డే భరిస్తుంది.

ఒంటరిగా ఉన్నారా? ఫిన్లాండ్‌కు ఫ్రీగా వెళ్లి ప్రేమను వెతుక్కోండి!
Finland Free Trip

Updated on: Nov 01, 2026 | 6:54 PM

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్ మరో అరుదైన మరియు వినూత్నమైన ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సింగిల్స్‌కు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా బ్లైండ్ డేట్ అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది. ఫిన్లాండ్ పర్యాటక బోర్డు విజిట్ ఫిన్లాండ్ ఆధ్వర్యంలో ఫిన్నిష్ డిన్నర్ డేట్ పేరుతో ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.

ట్రిప్ విశేషాలు, ప్రత్యేకతలు

ఈ విభిన్నమైన క్యాంపెయిన్ కింద ప్రపంచం నలుమూలల నుండి మొత్తం 16 మంది సింగిల్స్‌ను ఫిన్లాండ్ ప్రభుత్వం ఉచితంగా ఆహ్వానిస్తోంది. ఈ పర్యటన 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 19 మధ్య జరగనుంది.
ఎంపికైన అభ్యర్థులకు విమాన ప్రయాణ ఖర్చులు, వసతి, ప్రత్యేక కార్యకలాపాలు, రుచికరమైన భోజన ఖర్చులన్నీ టూరిజం బోర్డే పూర్తిగా భరిస్తుంది. హెల్సింకి, టాంపెరే ప్రాంతాలలో జరిగే ప్రత్యేక డిన్నర్ ఈవెంట్లలో అంతర్జాతీయ పాల్గొనేవారు స్థానిక ఫిన్నిష్ సింగిల్స్‌ను కలుసుకునే అవకాశం లభిస్తుంది.

ఫిన్నిష్ ఫుడ్, సంస్కృతి పరిచయం

ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం కేవలం డేటింగ్ మాత్రమే కాదు, ఫిన్లాండ్ గొప్ప ఆహార సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడం. వైల్డ్ ఫిష్, అడవి బెర్రీలు, పుట్టగొడుగులతో కూడిన వంటకాలను దేశంలోని ప్రముఖ చెఫ్‌లు ఈ డిన్నర్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నారు. ఫిన్లాండ్‌లో ప్రసిద్ధమైన సింకుకోరి అనే డేటింగ్ ట్రెండ్ నుండి ఈ ఆలోచన పుట్టుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఫిన్లాండ్‌లో నివసించని, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 18 ఏళ్లు నిండిన ఒంటరి వ్యక్తులు ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 10, 2026 నాటికి దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారి వివరాలు డిసెంబర్ 1న సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తారు.

దరఖాస్తు విధానం: మీరు డిన్నర్ డేట్‌కి వస్తే ఏ వంటకం వడ్డిస్తారు, ఎందుకు? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఒక చిన్న వీడియోను ఇంగ్లీష్‌లో రికార్డ్‌ చేయాలి. ఆ వీడియోను #FinnishDinnerDate అనే హ్యాష్‌టాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ లేదా యూట్యూబ్‌లో పోస్ట్ చేసి, విజిట్ ఫిన్లాండ్ ను ట్యాగ్ చేయాలి.

ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశంలో సరికొత్త ఆహారాన్ని ఆస్వాదిస్తూ, మీ జీవిత భాగస్వామిని లేదా మంచి స్నేహితులను కనుగొనే ఈ అద్భుత అవకాశాన్ని అస్సలు మిస్ కావద్దు?

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us