Viral Video: నాగుపాము, ముంగిసల మధ్య యుద్ధం.. చివరకు ఎవరు గెలిచారంటే? వీడియో చూస్తే షాకే

Cobra vs Mongoose: కుక్కలు- పిల్లులు, పిల్లులు- ఎలుకలు, పిల్లులు- కుక్కలు, పాము- ముంగిస.. ఇలా ఈ సృష్టిలోని కొన్ని జంతువుల మధ్య జాతి వైరం ఉంటుంది. ఈ రెండు జంతువులు ఒకదానికొకటి ఎదురుపడితే ఇక అంతే సంగతులు.

Viral Video: నాగుపాము, ముంగిసల మధ్య యుద్ధం.. చివరకు ఎవరు గెలిచారంటే? వీడియో చూస్తే షాకే
Cobra Vs Mongoose

Updated on: Sep 02, 2022 | 9:42 PM

Cobra vs Mongoose: కుక్కలు- పిల్లులు, పిల్లులు- ఎలుకలు, పిల్లులు- కుక్కలు, పాము- ముంగిస.. ఇలా ఈ సృష్టిలోని కొన్ని జంతువుల మధ్య జాతి వైరం ఉంటుంది. ఈ రెండు జంతువులు ఒకదానికొకటి ఎదురుపడితే ఇక అంతే సంగతులు. ఇక పాము, ముంగిసలు ఎదురుపడితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సాధారణంగా ఈ రెండు జంతువుల మధ్య జరిగే పోరులో ముంగిస తరచుగా గెలుస్తుంది. వీటికి సంబంధించిన వీడియోలు తరచూ సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రజలు ఈ వీడియోను చూడడమే కాకుండా విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. వీడియోలో ఒక చిత్తడి నేలలో పాము, ముంగిస ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. విచిత్రంగా పాము ముంగిసపై తీవ్రంగా దాడి చేస్తుంది. అదే సమయంలో, ముంగిస కూడా పాము నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే చివరకు పాముపై ముంగిసదే పైచేయి అవుతుంది.

snakes_of_india అనే పేరుగల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశారు. కాగా ఈ వీడియోలో నాగుపాము ముంగిసను పదే పదే కొరికి చంపాలని ప్రయత్నిస్తుంది. అయితే ముంగూస్ కూడా పాముపై ఎదురుదాడికి ప్రయత్నిస్తుంది. క్లిప్ చివరిలో ముంగిస నాగుపాముపై ఆధిపత్యం చెలాయిస్తుంది. కాబట్టి నాగుపాము అక్కడి నుంచి పారిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..