Viral Video: నా పర్మిషన్ తీసుకోవా ?.. ఏనుగు దెబ్బకు అమ్మాయి దిమ్మతిరిగిపోయింది..

|

May 24, 2022 | 8:54 PM

ఇక్కడ ఓ ఏనుగు చేసిన పని అయ్యో పాపం అనిపిస్తుంది.. అప్పటి వరకు ప్రశాంతంగా కనిపించిన ఏనుగుకు ఒక్కసారిగా కోపమోచ్చింది.

Viral Video: నా పర్మిషన్ తీసుకోవా ?.. ఏనుగు దెబ్బకు అమ్మాయి దిమ్మతిరిగిపోయింది..
Viral
Follow us on

జంతువులు చేసే అల్లరి చేష్టలు నవ్వులు తెప్పిస్తుంటాయి. కుక్క, పిల్లి, కోతి, ఏనుగులు చేసే పనులు సరదాగా అనిపిస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ సరదా పనులే ఇతరులను తీవ్రంగా ఇబ్బందిపెట్టేస్తాయి. చూస్తుండగానే మనుషులపై దాడి చేస్తాయి. ఇక సోషల్ మీడియాలో జంతువుల సరదా అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని నవ్వులు తెప్పించగా.. మరికొన్ని ఆశ్చర్యంగానూ.. అయ్యో పాపం అనే విధంగా ఉంటాయి. ఇక్కడ ఓ ఏనుగు చేసిన పని అయ్యో పాపం అనిపిస్తుంది.. అప్పటి వరకు ప్రశాంతంగా కనిపించిన ఏనుగుకు ఒక్కసారిగా కోపమోచ్చింది.. ఇంకేముంది తన ఎదురుగా ఉన్న అమ్మాయి చెంప పగలకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఉన్నట్టుండి ఆ ఏనుగుకు అంతంగా కోపం వచ్చిందో తెలుసుకుందామా.

ఓ జూ కు వెళ్లిన కొందరు పర్యాటకులు ఏనుగును చూసేందుకు దాని దగ్గరు వచ్చారు. ఏనుగు కూడా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ.. తొండం చాపుతూ వారి చేతులను పట్టుకుంది. అయితే అందరు ఏనుగు తొండాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ యువతి ఏనుగును ఫోటో తీయాలనుకుంది. వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ తీసి ఏనుగును ఫోటో తీయడానికి ప్రయత్నించింది. దీంతో ఆ ఏనుగు వెంటనే కోపంతో ఆ అమ్మాయిని కొట్టింది. దీంతో ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫోన్ ఎగిరిపోయి కింద పడగా.. ఆ అమ్మాయిని పక్కనే ఉన్న మరో వ్యక్తి పట్టుకున్నాడు. అమ్మాయిని కొట్టిన తర్వాత కిందపడిన ఫోన్ తీసుకోవడానికి తెగ ప్రయత్నించింది ఆ ఏనుగు. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడున్నవారు ఫోన్ తీసుకున్నారు. ఈ వీడియోను ఫెయిల్ ఆర్మీ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి