Viral News: లేడీ వెయిటర్‌ని ప్లేట్‌తో కొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్..

ఓ యువకుడు తన భార్య, బిడ్డతో కలిసి ఓ రెస్టారెంట్‌లో కూర్చొన్నాడు. ఫుడ్ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గర కూర్చొన్నారు. ఓ యువతి వారి టేబుల్‌పై భోజనం సర్వ్ చేసేందుకు వెళ్లింది. అప్పుడే అనుకోకుండా ఓ ఘటన జరిగింది. దీంతో అక్కడున్న వారు అందరూ షాక్‌కి గురయ్యారు. టేబుల్‌పై ఉంచిన ఖాళీ ప్లేట్‌తో లేడీ వెయిటర్ ముఖంపై కొట్టాడు. ఆ తర్వాత మీ భార్య, బిడ్డతో కలిసి అక్కడి నుంచి..

Viral News: లేడీ వెయిటర్‌ని ప్లేట్‌తో కొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్..
Viral Video
Follow us

|

Updated on: Aug 23, 2024 | 6:34 PM

ఓ యువకుడు తన భార్య, బిడ్డతో కలిసి ఓ రెస్టారెంట్‌లో కూర్చొన్నాడు. ఫుడ్ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గర కూర్చొన్నారు. ఓ యువతి వారి టేబుల్‌పై భోజనం సర్వ్ చేసేందుకు వెళ్లింది. అప్పుడే అనుకోకుండా ఓ ఘటన జరిగింది. దీంతో అక్కడున్న వారు అందరూ షాక్‌కి గురయ్యారు. టేబుల్‌పై ఉంచిన ఖాళీ ప్లేట్‌తో లేడీ వెయిటర్ ముఖంపై కొట్టాడు. ఆ తర్వాత మీ భార్య, బిడ్డతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ సంఘటన లండన్‌లోని స్ట్రాట్ ఫోర్డ్ ప్రాంతంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో జరిగింది. ఓ యువకుడు తన భార్య, బిడ్డతో కలిసి భోజనం చేసేందుకు ఈ రెస్టారెంట్‌కి వచ్చాడు. చిన్నారితో పాటు యువకుడి భార్య టేబుల్‌కు ఒకవైపు కూర్చొగా.. సదరు వ్యక్తి ఒక వైపు కూర్చొన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. అప్పుడే ఆర్డర్ పెట్టిన ఫుడ్ సర్వ్ చేసేందుకు ఓ లేడీ వెయిటర్ అక్కడికి వచ్చింది.

అసలు ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. వెయిటర్ రాగానే.. కస్టమర్ ఒక్కసారిగా ప్లేట్‌తో మొహం మీద కొట్టాడు. దీంతో లేడీ వెయిటర్ ఏమీ అనకుండా.. చేయకుండా.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. సదరు వ్యక్తిని కూల్ చేయమని భార్య చెబుతుంది. అయినా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లాడు వ్యక్తి. అనంతరం బిల్ కట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత హోటల్ మేనేజ్ మెంట్‌కి యువతి ఫిర్యాదు చేసింది. అనంతరం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. ఈ వీడియో లభ్యమైంది. ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. ఇది కాస్తా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘అసలు ఏం జరిగింది.. ఎందుకు కొట్టాడు?’.. ‘ఏం జరిగినా అలా వెయిటర్‌ని ప్లేట్ పెట్టి కొట్టడం సరైన పద్దతి కాదు’.. ‘ఆ తర్వాత ఏమైంది.. వాడు దొరికాడా’.. ‘అలాంటి వాళ్లను వదిలి పెట్టకూడదు’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో చూడండి:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..