Ravi Teja: షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ.. యశోద ఆస్పత్రిలో చికిత్స

ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు ఆర్టీ 75 మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో రవితేజ గాయపడ్డట్టు తెలుస్తోంది. ఆర్టీ75వ షూటింగ్ లో రవితేజ కుడిచేతికి గాయం అయిందని తెలుస్తోంది. గాయాన్ని కూడా లెక్కచేయకుండా రవితేజ షూటింగ్ ను కంటిన్యూ చేశారట.

Ravi Teja: షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Raviteja
Follow us

|

Updated on: Aug 23, 2024 | 7:38 PM

మాస్ మాహారాజా రవితేజ షూటింగ్ లో గాయపడ్డారని తెలుస్తోంది. ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు ఆర్టీ 75 మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో రవితేజ గాయపడ్డట్టు తెలుస్తోంది. ఆర్టీ75వ షూటింగ్ లో రవితేజ కుడిచేతికి గాయం అయిందని తెలుస్తోంది. గాయాన్ని కూడా లెక్కచేయకుండా రవితేజ షూటింగ్ ను కంటిన్యూ చేశారట. గాయంతోనే షూటింగ్ లో  రవితేజ పాల్గొన్నారు. కుడిచేతి గాయం ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రిలో రవితేజకు శస్త్రచికిత్స తీసుకున్నారు. ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యుల సూచించారని తెలుస్తోంది.

మిస్టర్ బచ్చన్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఆర్టీ 75  పాల్గొంటున్నారు మాస్ రాజా. యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోన్న సమయంలో షూటింగ్ లో రవితేజకు గాయం అయ్యిందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవితేజ త్వరగా కోలుకోవాలంటూ.. అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.