Trending News: పార్కు క్లీనింగ్ కోసం రంగంలోకి దిగిన కాకులు.. చెత్త కనిపించదు..

కాకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిత్యం కావ్ కావ్ అంటూ అరుస్తూ ఉంటాయి. సిటీల్లో కంటే ఇంకా గ్రామాల్లోనే కాకులు ఎక్కువగా ఉంటాయి. కాకులతో పిల్లలకు కూడా కలిసి ఆడుతూ ఉంటారు. కాకి కష్ట పడే తత్వం ఎక్కువే. సాధారణంగా కాకులకు ఆహారం దొరికితే ఇతర కాకులను కూడా పిలిచి.. అన్నీ కలిసి తింటాయి. ఇదెలా ఉంటే ఇంకొందరు కాకి అరిస్తే బంధువులు వస్తారని, కాకిని తాకితే అపశకునం అంటారు. మరికొందరు మాత్రం కావ్ కావ్ అంటూ పిలిచి ఆహారం..

Trending News: పార్కు క్లీనింగ్ కోసం రంగంలోకి దిగిన కాకులు.. చెత్త కనిపించదు..
Trending News
Follow us

|

Updated on: Aug 23, 2024 | 5:37 PM

కాకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిత్యం కావ్ కావ్ అంటూ అరుస్తూ ఉంటాయి. సిటీల్లో కంటే ఇంకా గ్రామాల్లోనే కాకులు ఎక్కువగా ఉంటాయి. కాకులతో పిల్లలకు కూడా కలిసి ఆడుతూ ఉంటారు. కాకి కష్ట పడే తత్వం ఎక్కువే. సాధారణంగా కాకులకు ఆహారం దొరికితే ఇతర కాకులను కూడా పిలిచి.. అన్నీ కలిసి తింటాయి. ఇదెలా ఉంటే ఇంకొందరు కాకి అరిస్తే బంధువులు వస్తారని, కాకిని తాకితే అపశకునం అంటారు. మరికొందరు మాత్రం కావ్ కావ్ అంటూ పిలిచి ఆహారం అందిస్తారు. ఇలా ఎవరి వెర్షన్ వారిది అన్నట్టు ఉంటారు. ఇప్పటికే కాకికి సంబంధించిన కథలు చాలానే విని ఉంటారు. కానీ ఈ కాకుల కథ మాత్రం కాస్త కొత్తగానే ఉంటుంది. మనుషులు పాడు చేసిన ప్రదేశాన్ని క్లీన్ చేస్తూ మన్నలు పొందుతున్నాయి. సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతున్నాయి. మనషులు చేసిన తప్పులను సరిదిద్దుతున్నాయి. ఈ కాకుల స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే.. స్వీడన్ వరకు వెళ్లాలి.

విషయంలోకి వస్తే.. ఫ్రాన్స్‌లోని ఓ పార్కులో ఎక్కువగా సీగరెట్ పీకలే ఎక్కువగా కనిపిస్తాయి. మనుషులకు ఎంత అవైర్ నెస్ కల్పించినా అబ్బే అస్సలు మారడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీంతో కాకులను రంగంలోకి దించారు. ఎక్కడ సిగరెట్ పీకలు కనిపించినా వెంటనే వీటిని చెత్త డబ్బాలో పడేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు. అలాగని ఇవేమీ ఉచితంగా పని చేయవు. వీటికి నచ్చిన ఆహారాన్ని అందిస్తున్నారు. 2018 నుంచి ఫ్రాన్స్‌లోని పశ్చిమ ప్రాంతంలోని థీమ్ పార్కు అధికారులు పార్క్‌ను శుభ్రంగా ఉంచడానికి ఒక పద్ధతిని అనుసరించారు. కాకులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. పార్క్‌లో ఎక్కడైనా సిగరెట్ పీకలు లేదా మరేదైనా వ్యర్థాలు పడి ఉంటే వెంటనే దానిని తీసుకొని డస్ట్ బిన్‌లో వేయాలని ట్రైనింగ్ ఇచ్చారు.

ఇక అప్పటి నుంచి కాకులకు ఇదే పని. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు తిరగడమే వీరి పని.. ఎక్కత చెత్త కనిపించినా ఏమాత్రం అలసత్వం వహించకుండా వాటి పనిని పూర్తి చేస్తున్నాయి. వీటికి ట్రైనింగ్ ఇచ్చేందుకు నెలల సమయం పట్టిందని అక్కడ పార్క్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

View this post on Instagram

A post shared by Pubity (@pubity)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..