Viral Video: జనాలున్నా డోంట్ కేర్.. మెట్రో స్టేషన్‌లో ఘాడమైన లిప్ లాప్..

|

Dec 16, 2024 | 4:27 PM

అక్కడ కెమెరాలు ఉంటాయని వారికి తెలుసు.. ఎవరైనా రికార్డు చేస్తారేమో అన్న సెన్స్ కూడా ఉంది. అయినా కానీ అస్సలు తగ్గలేదు. మెట్రో స్టేషన్‌లో లిప్ లాక్స్‌తో చెలరేగిపోయారు... వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: జనాలున్నా డోంట్ కేర్.. మెట్రో స్టేషన్‌లో ఘాడమైన లిప్ లాప్..
Couple Kiss
Follow us on

కొంతమంది ప్రేమికులు ఈ మధ్య హద్దులు లేకుండా ప్రవర్తించడం మనం చూస్తేనే ఉన్నాం. ఈ జనరేషన్‌కు పిచ్చి పట్టినట్లుంది అని సీనియర్ సిటిజన్స్ కామెంట్స్ కూడా వింటూనే ఉన్నాం. అయితే ఇప్పటి టీనేజర్స్, యువత ఎవర్నీ పట్టించుకోవడం లేదు. ప్లేస్‌ని పట్టించుకోకుండా రొమాన్స్‌లోకి దిగిపోతున్నారు. ముద్దు, హగ్గులతో చెలరేగిపోతున్నారు. ఇటీవల ఢిల్లీ, ముంబై మెట్రో ట్రైన్స్‌లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా చూశాం. ఇప్పుడు కోల్‌కతా మెట్రో కూడా అందుకు మినహాయింపు కాదని తేలింది.

తాజాగా సోషల్ మీడియాలో యువతీ యువకుడి రొమాన్స్ వీడియో వైరల్‌గా మారింది. కాళీఘాట్ మెట్రో స్టేషన్‌లో ఓ జంట గాఢంగా ముద్దు పెట్టుకున్న దృశ్యాన్ని కొందరు రికార్డు చేశారు. చుట్టుపక్కల జనాలు వెళ్తున్నా పట్టించుకోకుండా వారు లిప్ టూ లిప్ కిస్‌లో మునిగితేలారు. వీడియోలో కనిపిస్తున్నది మాత్రం కాళీఘాట్ మెట్రో స్టేషన్. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత లేదు (టీవీ9 తెలుగు వీడియో ప్రామాణికతను ధృవీకరించలేదు). 

ఈ జంట చేసిన ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోకు ఇప్పటికే లైక్‌లు, కామెంట్‌ల వరద కొనసాగుతోంది. సోషల్ మీడియాలో మిక్స్డ్‌ రెస్పాన్స్‌లు వస్తున్నాయి. కొందరు పబ్లిక్‌లో డీసెన్సీ లేకుండా ఆ పని ఏంటని తిట్టిపోస్తున్నారు. ముసలివాళ్ల మాటల్ని పట్టించుకోకండి.. ప్రేమలో మునిగితేలండి అని మరికొందరు ఆ జంటకు మద్దతుగా మాట్లాడుతున్నారు. మరి వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి…

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి