ఈ దేశాల్లో ఒక్క పాము కూడా ఉండదు.. ఒకవేళ కనిపిస్తే ఏం చేస్తారో తెలిస్తే మైండ్ బ్లాంకే..

ప్రకృతి వైవిధ్యం ఎంతో వింతైనది. ప్రపంచమంతా రకరకాల విష సర్పాలు సంచరిస్తుంటే, కొన్ని దేశాల్లో మాత్రం ఒక్క పాము కూడా కనిపించదు. పాములు శీతల రక్త జీవులు కావడం ఒక కారణమైతే, ఆ దేశాల భౌగోళిక చరిత్ర మరో కారణం. అసలు అంటార్కిటికా నుండి న్యూజిలాండ్ వరకు పాములు లేని దేశాల గురించి తెలుసుకుందాం..

ఈ దేశాల్లో ఒక్క పాము కూడా ఉండదు.. ఒకవేళ కనిపిస్తే ఏం చేస్తారో తెలిస్తే మైండ్ బ్లాంకే..
Countries With Zero Snakes

Updated on: May 12, 2026 | 1:05 PM

ఈ భూమి మీద పాములు అంటే భయపడని వారు ఉండరు. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, అక్కడ అడుగు పెడితే ఒక్క పాము కూడా మీకు కనిపించదు. న్యూజిలాండ్, ఐర్లాండ్, ఐస్‌లాండ్ వంటి ప్రాంతాల్లో పాముల జాడ అస్సలు ఉండదు. ఇది వినడానికి వింతగా ఉన్నా.. దీని వెనుక బలమైన శాస్త్రీయ, భౌగోళిక కారణాలు ఉన్నాయి. పాములు శీతల రక్త జీవులు. అంటే మనలాగా అవి తమ శరీర ఉష్ణోగ్రతను తాము నియంత్రించుకోలేవు. బయటి వాతావరణం వేడిగా ఉంటేనే వాటి శరీరం వేడెక్కి, కదలడానికి శక్తి వస్తుంది. అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్ వంటి ప్రదేశాలలో ఎల్లప్పుడూ విపరీతమైన చలి ఉంటుంది. అంతటి చలిలో పాములు వేటాడలేవు, కనీసం శ్వాస కూడా తీసుకోలేవు. అందుకే ఈ మంచు ఖండాల్లో పాములు బ్రతకడం అసాధ్యం.

ద్వీప దేశాలకు భౌగోళిక శాపం

న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి దేశాలు సముద్రంతో చుట్టుముట్టబడిన ద్వీపాలు. లక్షల సంవత్సరాల క్రితం ఖండాలు విడిపోయినప్పుడు, పాములు ఈ ప్రాంతాలకు చేరుకోలేకపోయాయి. దాదాపు 85 మిలియన్ సంవత్సరాల క్రితమే ఇది ప్రధాన భూభాగం నుండి విడిపోయింది. అప్పటికి ఆధునిక పాములు ఇంకా పరిణామం చెందలేదు. హిమయుగం తర్వాత సముద్ర మట్టాలు పెరగడంతో ఇది వేరుపడింది. మధ్యలో ఉన్న విశాలమైన సముద్రాన్ని దాటి పాములు అక్కడికి వలస వెళ్ళలేకపోయాయి.

చట్టాలు చాలా కఠినం.. కనిపిస్తే మరణశిక్షే

కేవలం ప్రకృతి మాత్రమే కాదు, ఆ దేశాల ప్రభుత్వాలు కూడా పాములను శత్రువులుగా చూస్తాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌లో జీవ భద్రతా చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అక్కడ పాములను పెంచుకోవడం లేదా జంతు ప్రదర్శనశాలల్లోకి దిగుమతి చేసుకోవడం కూడా నేరం. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా పాము కనిపిస్తే, వెంటనే దాన్ని పట్టుకుని చంపేస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పాములకు సహజ సిద్ధమైన శత్రువులు ఉండవు. పాములు అక్కడికి ప్రవేశిస్తే అరుదైన పక్షులను, జీవులను తినేసి జీవావరణ వ్యవస్థను నాశనం చేస్తాయని వారి భయం. అందుకే అమెరికాలోని హవాయి, అలస్కా రాష్ట్రాల్లో కూడా పాము కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందే.

సముద్రపు పాముల భయం

భూమిపై సంచరించే పాములు లేకపోయినా, న్యూజిలాండ్ వంటి దేశాల తీర ప్రాంతాల్లో అప్పుడప్పుడు సముద్రపు పాములు కనిపిస్తాయి. అలల తీవ్రతకు ఒడ్డుకు కొట్టుకొచ్చే ఈ పాములు అత్యంత విషపూరితమైనవి. అయితే ఇవి భూమిపై ఎక్కువ కాలం బ్రతకలేవు.

Follow Us