Viral Video: మాకు లాక్ డౌన్ మళ్ళీ కావాలంటున్న స్టూడెంట్స్.. వాళ్ళు చెప్పిన రీజన్ వింటే నవ్వకుండా ఉండలేరుగా..

|

Jan 24, 2022 | 2:22 PM

Viral Video: దేశంలో మొదటిసారి లాక్‌డౌన్ (Lock Down)విధించినప్పుడు.. సోషల్ మీడియాలో చాలా ఫన్నీ వీడియోలు షేర్ చేయబడ్డాయి. ఇప్పుడు మరోసారి ప్రపంచవ్యాప్తంగా, కొత్త వేరియంట్ కరోనా ( Corona Virus) ఓమిక్రాన్(Omicron)..

Viral Video: మాకు లాక్ డౌన్ మళ్ళీ కావాలంటున్న స్టూడెంట్స్.. వాళ్ళు చెప్పిన రీజన్ వింటే నవ్వకుండా ఉండలేరుగా..
Viral Video
Follow us on

Viral Video: దేశంలో మొదటిసారి లాక్‌డౌన్ (Lock Down)విధించినప్పుడు.. సోషల్ మీడియాలో చాలా ఫన్నీ వీడియోలు షేర్ చేయబడ్డాయి. ఇప్పుడు మరోసారి ప్రపంచవ్యాప్తంగా, కొత్త వేరియంట్ కరోనా ( Corona Virus) ఓమిక్రాన్(Omicron) కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి.. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. త్వరలో లాక్‌డౌన్ అంటూ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా కొంతమంది చిన్నారులు లాక్‌డౌన్ గురించి తమదైన శైలిలో స్పందించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిని చూసిన వారు నవ్వు ఆపుకోలేరు .

లాక్ డౌన్ గురించి మాట్లాడినప్పుడల్లా విద్యార్థుల స్పందన అద్భుతంగా ఉంది. చాలా మంది విద్యార్థులు ఈ సమస్యపై తమ స్పందన తెలియజేస్తుండగా తాజాగా ఒక వీడియో మళ్ళీ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో, కొంతమంది విద్యార్థులు ఒక ప్లేస్ లో కూర్చున్నారు. అప్పుడు ఒక విద్యార్థి.. టివీ రిపోర్టర్ గా మారి.. మరొక విద్యార్థిని చేరుకుని, లాక్‌డౌన్ విధించాలా వద్దా .. మీకు ఏమని అనిపిస్తుంది.. అని అడిగితే.. వెంటనే ఆ విద్యార్థి స్పందిస్తూ.. నేను లాక్‌డౌన్‌ తప్పదని అనుకుంటున్నాను..నేను నా చదువుని ఈజీగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. మాకు ఈజీగా పై క్లాసులకు ప్రమోషన్ అవడం ముఖ్యం.. అందుకనే నేను లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్నా అని సరదాగా చెప్పాడు. ఇక ఇదే విషయంపై మరొక విద్యార్ధి స్పందిస్తూ.. దేశంలో లాక్డౌన్ ఉండాలని నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను ఎందుకంటే నాకు కూడా ఈజీగా ప్రమోషన్ కావాలి.. నాకు చదువుకోవడం.. రాయడం ఇష్టం లేదని చెప్పాడు.

ఈ ఫన్నీ వీడియోని జనాలు విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు పిల్లల హావభావాలకు .. వారి ఫన్నీ ఆలోచనాలకు నెటిజన్లు ఫిదా. స్టూడెంట్స్ కాన్సెప్ట్ కు .. సరదా వ్యాఖ్యలకు చూసిన వారు నవ్వకుండా ఉండలేరు.. మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి.

Also Read  హాలీవుడ్‌ పాటకు భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లి కూతురు..!