Watch: వార్నీ ఇంతలేదు.. పెద్దపులినే బురిడీ కొట్టించి తుర్రుమన్న బాతుపిల్ల… వీడియో చూస్తే పొట్టచెక్కలే..

|

Aug 19, 2024 | 5:15 PM

కింద పడిపోయిన బాతును చూసి పులి షాక్‌ అవుతుంది. బాతు చచ్చిపోయినట్లుందే.. అనుకుంది. ఓ పక్కకు తీసుకెళ్లి తిద్దాంలే అనుకుందో ఏమోగానీ, దాన్ని నోట కరుచుకుని కాస్త పక్కకు తీసుకెళ్తుంది. పడుకున్న తర్వాత నోటిలో ఉన్న బాతును నేలపై పడేసి దాన్ని వాసన చూస్తూ మరోసారి పరిశీలిస్తుంది. ఈ క్రమంలో బాతు అలెర్ట్ అవుతుంది. ఒక్కసారిగా పైకి లేచి అక్కడి నుంచి ఉడాయించేసింది.

Watch: వార్నీ ఇంతలేదు.. పెద్దపులినే బురిడీ కొట్టించి తుర్రుమన్న బాతుపిల్ల... వీడియో చూస్తే పొట్టచెక్కలే..
Clever Duck
Follow us on

అడవికి రాజు సింహాం.. అలాంటి సింహం అంటే అడవిలోని జంతువులకు హడల్‌.. పులులు, సింహాలను చూసి జంతువులే కాదు పశు, పక్షాదులు, ప్రజలు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పారిపోతుంటాయి. వాటి చప్పుడు వినపడగానే కంటికి కనిపించనంత దూరం పారిపోతుంటాయి. లేదంటే వాటికి చిక్కామో ఇక ఆ క్షణంలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. అయితే, కొన్ని కొన్ని సందర్భాల్లో సింహలు, పులి చేతికి చిక్కిన తప్పించుకున్న ఘటనలు కూడా చూస్తుంటాం. అలాంటిదే ఇక్కడో వీడియో వైరల్‌గా మారింది. పులి పంజా నుంచి తప్పించుకున్న బాతు ఎలా ప్రాణాలతో బయటపడిందో ఇక్కడ చూడొచ్చు.

సోషల్ మీడియాలో పులి పంజా నుంచి తప్పించుకన్న బాతు వీడియో తెగ వైరల్ అవుతోంది. వేట కోసం ఎదురుచూస్తున్న ఓ పులికి ఓ చిన్న బాతు కనిపిస్తుంది. దీంతో దాన్ని వేటాడుతుంది పులి. బాతు వెనకాలే వెళ్తుంది. వెనుకే పులి రావడాన్ని గమనించిన బాతు.. తన తెలివికి పదునుపెడుతుంది. హఠాత్తుగా నేలపై చనిపోయినట్లు పడుకుండిపోతుంది. దీంతో పులి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కింద పడిపోయిన బాతును చూసి పులి షాక్‌ అవుతుంది. బాతు చచ్చిపోయినట్లుందే.. అనుకుంది. ఓ పక్కకు తీసుకెళ్లి తిద్దాంలే అనుకుందో ఏమోగానీ, దాన్ని నోట కరుచుకుని కాస్త పక్కకు తీసుకెళ్తుంది. పడుకున్న తర్వాత నోటిలో ఉన్న బాతును నేలపై పడేసి దాన్ని వాసన చూస్తూ మరోసారి పరిశీలిస్తుంది. ఈ క్రమంలో బాతు అలెర్ట్ అవుతుంది. ఒక్కసారిగా పైకి లేచి అక్కడి నుంచి ఉడాయించేసింది. తుర్రుమని పరిగెత్తిన బాతును చూసి చూసి బిక్కముఖం వేయాల్సి వచ్చింది. ఆకలిమీదున్న పులికి ఆహారం దొరికిందని ఆశపడినంతలోనే చేతికి చిక్కిన బాతు తప్పించుకోవటంతో పులి చూస్తుండిపోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో ప్రస్తుతం 4.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ బాతు నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్‌ చేశారు. ‘పులినే ఫూల్ చేసిన బాతు ఇది అంటూ మరికొందరు వ్యాఖ్యనించారు. మొత్తానికి ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్ల నుంచి వివిధ రకాల ఎమోజీలతో కూడిన ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..