Viral Video: అదృష్టం అంటే ఇదే మరీ.! తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు.. వైరల్ వీడియో.!

|

Sep 15, 2021 | 9:49 PM

Viral Video: ఎవరికి చావు.. ఏ రూపంలో వ‌స్తుందో ఎవ్వరూ చెప్పలేరు. దీర్ఘకాల స‌మ‌స్యతో క‌న్నుమూసేవారు కొంద‌రైతే.. రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయేవారు..

Viral Video: అదృష్టం అంటే ఇదే మరీ.! తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు.. వైరల్ వీడియో.!
Snake Video
Follow us on

ఎవరికి చావు.. ఏ రూపంలో వ‌స్తుందో ఎవ్వరూ చెప్పలేరు. దీర్ఘకాల స‌మ‌స్యతో క‌న్నుమూసేవారు కొంద‌రైతే.. రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయేవారు మ‌రికొంద‌రు. అయితే.. ఈ రెండో ర‌కం ప్రాణాపాయం నుంచి కొంద‌రు తృటిలో త‌ప్పించుకుంటారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు చూసిన‌ప్పుడు ఎవ్వరైనా షాక్‌కు గుర‌వ్వాల్సిందే. అందుకు సంబంధించిన వీడియోలు తరచూ మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఆ కోవకు చెందిన ఓ ఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఒక దుకాణంలో ప‌దేళ్ల బాలుడు సెల్ ఫోన్‌లో ఏదో చూసుకుంటున్నాడు. కాసేప‌టి త‌ర్వాత షాపులో ఉన్న బెంచీపై న‌డుము వాల్చేందుకు రెడీ అయ్యాడు. త‌లెత్తి చూసేస‌రికి పైన పాము క‌నిపించింది. వెంట‌నే లేచి బ‌య‌ట‌కు ప‌రిగెత్తాడు. అంతే అతడు అలా లేచాడో లేదో.. స‌రిగ్గా అత‌ను ప‌డుకున్న చోట‌నే ప్రమాద‌క‌ర‌మైన న‌ల్లత్రాచు పాము ప‌డింది. పాము ఎలుక‌ను వేటాడుతుండ‌గా.. దాన్నుంచి త‌ప్పించుకునేందుకు ఎలుక ఆ బాలుడు ప‌డుకోవాల‌నుకున్న ప్రాంతంలో దూకేసింది. దాన్ని ప‌ట్టుకునేందుకు పాము కూడా వెంట‌నే కిందకు దూకింది. ఆ బాలుడు గ‌న‌క అక్కడ ప‌డుకుని ఉంటే ఖ‌చ్చితంగా అత‌నిమీద పాము ప‌డేది. ఆ వేట‌లో భాగంగా.. అత‌డిని ఖ‌చ్చితంగా కాటువేసి ఉండేదని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.