సింహం vs పులి తలపడితే గెలుపు ఎవరిది.. ఆన్సర్ అస్సలు ఊహించలేరంతే..?

Lion vs Tiger: సింహం, పులి తలపడితే ఎవరు గెలుస్తారు. ఈ ప్రశ్న మనలో చాలామందికి వచ్చే ఉంటుంది. ఈ రెండు జంతువులు తలపడడం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా చాలా అరుదే. మరి అలాంటి ప్రశ్నకు జవాబు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

సింహం vs పులి తలపడితే గెలుపు ఎవరిది.. ఆన్సర్ అస్సలు ఊహించలేరంతే..?
Loin Vs Tiger
Image Credit source: Ai Image

Updated on: Sep 04, 2026 | 11:34 AM

Lion vs Tiger: సింహం, పులి.. ఈ రెండు జంతవులకు అడివిలో తిరుగేలేదు. వీటి కంట పడిన ఏ జంతువైనా వీటికి ఆహారంగా మారాల్సిందే. మరి ఈ రెండు జంతువులు తలపడితే ఏది గెలుస్తుంది. అసలు ఈ రెండింటింలో ఏ జంతువు బలమైనదో ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ ప్రశ్నకు చాలా ఆసక్తిని కలిగిస్తోంది కదూ. అయితే అడవిలో ఈ రెండు జంతువులు సాధారణంగా ఒకదానితో ఒకటి ఎదురుపడవు. వాటి శరీర నిర్మాణం, పరిమాణం, వేట విధానం, జీవించే ప్రాంతం వంటి అంశాలను పరిశీలిస్తే కొన్ని స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. సాధారణంగా పెద్ద పులులు సింహాల కంటే ఎక్కువ బరువు, కండరాల బలంతో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పులి ఒంటరిగా వేటాడే జంతువు కాగా.. సింహాలు గుంపుగా వేటాడుతాయి. అందువల్ల రెండింటి బలాన్ని కేవలం ఒకే ప్రమాణంతో నిర్ణయించడం సరికాదని చెబుతున్నారు.

బలంలో తోపు జంతువు ఏదంటే.?

పులులు సాధారణంగా సింహాల కంటే భారీ శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా మగ పులులు అధిక శరీర బరువు, బలమైన కండరాలతో కనిపిస్తాయి. వేటాడే సమయంలో పులులు తమ శారీరక శక్తిని ఉపయోగించి ఎరపై దాడి చేసి, అదుపులోకి తెచ్చుకుంటాయి. కాగా, ఈ రెండు జంతువులు ఒకదానితో ఒకటి తలపడితే పులికి కొంత ఆధిక్యం లభిస్తుందని చెబుతున్నారు.

వేటాడే విధానంలో తేడా..

పులులు సాధారణంగా ఒంటరిగా వేటాడతాయి. దట్టమైన ప్రాంతాల్లో దాక్కొని ఎరపై ఆకస్మికంగా దాడి చేయడం వాటి వేట వ్యూహంలో కీలక అంశం. మరోవైపు సింహాలు గుంపులుగా, అంటే ప్రైడ్‌లుగా జీవిస్తూ సమన్వయంతో వేటాడతాయి. అందువల్ల సింహాల బలం వాటి సామూహిక వేటలోనూ కనిపిస్తుంది.

మరి ఎవరు గెలుస్తారు?

ఒక సింహం, ఒక పులి మధ్య జరిగే పోరును శాస్త్రీయంగా ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో చెప్పడం సాధ్యం కాదు. వయస్సు, లింగం, పరిమాణం, శారీరక స్థితి, పరిస్థితులు వంటి అంశాలు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే, కండరాల బలం, ఒంటరిగా వేటాడే సామర్థ్యం వంటి అంశాలను కలిపి చూసినప్పుడు పులికి ఆధిక్యం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us