AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నమ్మి ఇంట్లో పెట్టుకుంటే.. చిన్నారి పాలలో ఉమ్మిన హెల్పర్! సీసీటీవీతో బట్టబయలు!

తాము ఉద్యోగాలకు వెళ్లినప్పుడు చిన్నారుల బాధ్యతను హెల్పర్లకు అప్పగిస్తుంటారు పేరంట్స్‌. వారు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తారు అయితే వారి నమ్మకాన్ని వమ్ము చేసిన ఓ మహిళ నాలుగేళ్ల చిన్నారికి పాలు కలిపి ఇచ్చే సమయంలో ఒకసారి కాదు.. ఏకంగా నాలుగుసార్లు అందులో ఉమ్మివేసింది. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తల్లి ఈ దారుణం చూసి ఒక్కసారిగా షాకైంది.

నమ్మి ఇంట్లో పెట్టుకుంటే.. చిన్నారి పాలలో ఉమ్మిన హెల్పర్! సీసీటీవీతో బట్టబయలు!
Helper Accused Of Spitting Into Childs Milk Four Times
Sharada V
|

Updated on: Nov 10, 2026 | 8:55 AM

Share

తాము ఉద్యోగాలకు వెళ్లినప్పుడు చిన్నారుల బాధ్యతను హెల్పర్లకు అప్పగిస్తుంటారు పేరంట్స్‌. వారు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తారు అయితే వారి నమ్మకాన్ని వమ్ము చేసిన ఓ మహిళ నాలుగేళ్ల చిన్నారికి పాలు కలిపి ఇచ్చే సమయంలో ఒకసారి కాదు.. ఏకంగా నాలుగు రోజులు నాలుగుసార్లు అందులో ఉమ్మివేసింది. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తల్లి ఈ దారుణం చూసి ఒక్కసారిగా షాకైంది.

పాలు కలుపుతూ దారుణం.. నాలుగుసార్లు అదే పని!

హాంకాంగ్‌లోని కెన్నెడీ టౌన్ ప్రాంతం ప్రైవేట్ నివాస సముదాయంలో ఈ ఘటన జరిగింది. ఓ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు ఇద్దరు ఫిలిప్పీన్స్ మహిళలు ఇంట్లో పనిచేస్తున్నారు. వీరిలో 37 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం పనిలో చేరింది. ఆమెకు పిల్లల కేర్ టేకర్ గా అనుభవం ఉంది.

అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 మధ్య ఆమె ప్రవర్తనపై తల్లికి అనుమానం వచ్చింది.  దాంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తల్లి విస్తుపోయింది.  చిన్నారికి పాలు కలిపే సమయంలో వంటగదిలో ముందుగా ఓ కప్పులో ఉమ్మివేసి, ఆ తర్వాత ఆ పాలను చిన్నారికి ఇచ్చిందని తెలిసి తల్లి తీవ్రంగా షాకైంది.

సీసీటీవీ ఫుటేజ్ తో అసలు విషయం బయటకు!

చిన్నారి తల్లి ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోంది. ఇంట్లోని హెల్పర్ అనుమానాస్పద ప్రవర్తనపై ఆమకు అనుమానం రావడంతో నవంబర్ 7న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించింది. అందులో కనిపించిన దృశ్యాలు చూసి షాకైంది. తన కూతురికి పాలు కలిపే సమయంలో ఇంట్లో పనిచేసే ఫిలిపినో మహిళ ఉమ్మివేస్తున్నట్లు గుర్తించింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 మధ్య ఇలాంటి ఘటనలు నాలుగుసార్లు  జరిగినట్లు తెలుసుకుంది. ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారికి ఇచ్చే ఆహారంలో ఉమ్మివేసినట్లు ఆరోపించింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆరోపణలను ఖండించిన మహిళ.. పోలీసుల అదుపులోకి!

ఈ ఘటనపై సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన  పోలీసులు 37 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని హింసించినట్లు అనుమానిస్తూ కేసు నమోదు చేసారు. తనపై వచ్చిన ఆరోపణలను సదరు మహిళ ఖండించింది. చిన్నారి శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిన అవసరం కూడా రాలేదని పోలీసులు తెలిపారు.

ఆ చిన్నారి తన తల్లిదండ్రులు, ఎనిమిదేళ్ల సోదరుడితో కలిసి నివసిస్తోంది. ఇంట్లో ఇద్దరు ఫిలిపినో మహిళలు పనిచేస్తున్నారు. విచిత్రమేంటంటే.. రెండేళ్లుగా ఆ మహిళ అక్కడే పనిచేస్తున్నప్పటికీ గతంలో చిన్నారిపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులేవీ లేవు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో అప్పగించిన చిన్నారి విషయంలో ఇలాంటి ఆరోపణలు రావడం ఆ కుటుంబాన్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం ఈ ఘటనపై హాంకాంగ్ పోలీసులు కేసు నమోదు చేసి మహిళను అరెస్ట్ చేసారు.

Follow Us