వార్నీ.. ఇదేం పిచ్చిపని తల్లి..! బాలింతవు మంచిది కాదని చెబితే.. భర్తపై గృహహింస కేసుపెట్టిన మహా ఇల్లాలు..

|

Aug 26, 2024 | 11:52 AM

కొద్ది రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి తనను భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో అతడు బోరున విలపిస్తూ బిక్కముఖం వేయాల్సి వచ్చింది. ఇందుకు కారణంటో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

వార్నీ.. ఇదేం పిచ్చిపని తల్లి..! బాలింతవు మంచిది కాదని చెబితే.. భర్తపై గృహహింస కేసుపెట్టిన మహా ఇల్లాలు..
High Court
Follow us on

ప్రతి ఇంట్లోనూ గొడవలు సహజం.. ఇక భార్యాభర్తల మధ్య తగదాలు సర్వసాధారణం. కానీ, ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే కాపురాలను చిత్తు కాగితాల్ల చింపేసుకుంటున్నారు. ఇక కొందరు చిన్నపాటి మనస్పర్థాలకే విడాకులు తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే, తాజాగా ఓ భార్య సైతం ఇలాగే భర్తపై ఫిర్యాదు చేసింది. కొద్ది రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి తనను భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో అతడు బోరున విలపిస్తూ బిక్కముఖం వేయాల్సి వచ్చింది. ఇందుకు కారణంటో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

కర్నాటకకు చెందిన ఒక దంపతులు ఇటీవలే ఒక బిడ్డ పుట్టింది. కాన్పు తర్వాత భార్య ఆరోగ్యం విషయంలో భర్త పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. పౌష్టికాహారం తీసుకోవాలని పదే పదే భార్యకు సూచిస్తూ వచ్చాడు. తనకు కావాల్సిన, అవసరమైన ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తాజాగా తీసుకొచ్చి ఇచ్చేవాడు. అయితే, తనకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలని ఉందని భార్య కోరింది. బాలింతరాలు కావడంతో జంక్ ఫుడ్ తినకూడదని భర్త అభ్యంతరం చెప్పాడు. దీంతో మండిపడ్డ భార్య.. తన భర్తపై కేసు పెట్టింది. తనను ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వడంలేదని, ఇది గృహ హింస కిందికే వస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చేసేది లేక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు భర్తను స్టేషన్ కు పిలిచారు.

భార్య పెట్టిన కేసుతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ వింత కేసును విచారించిన జడ్జి.. జరిగిన సంగతి తెలుసుకున్నాక భార్యను మందలించారు. భార్య ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అతడు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన వద్దని చెబితే ఎదురు కేసు పెట్టడం సరైనది కాదని కోర్టు సూచించింది. దీంతో ఆ భర్తకు ఊరట లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..