Viral Video: ఇది కదా ర్యాగింగ్ అంటే.. భారీ ఏనుగును భయపెట్టిన లేగదూడ.. వీడియో చూస్తే షాక్..!

|

Jul 19, 2022 | 9:53 AM

Viral Video: సాధారణంగా పెద్ద జీవిని చూస్తే చిన్న జీవులు హడలిపోతాయి. అవి కనిపించడమే ఆలస్యం వాటికి దూరంగా జారుకుంటాయి.

Viral Video: ఇది కదా ర్యాగింగ్ అంటే.. భారీ ఏనుగును భయపెట్టిన లేగదూడ.. వీడియో చూస్తే షాక్..!
Wild Life
Follow us on

Viral Video: సాధారణంగా పెద్ద జీవిని చూస్తే చిన్న జీవులు హడలిపోతాయి. అవి కనిపించడమే ఆలస్యం వాటికి దూరంగా జారుకుంటాయి. కానీ, ఇక్కడ ఓ లేగ దూడ మాత్రం భారీ ఏనుగును హడలెత్తించింది. వెంటబడి మరీ పరుగెత్తించింది. కనీసం ఆ ఏనుగు మోకాలి ఎత్తు కూడా లేని ఆ లేగ దూడ.. ఏనుగు దారుణంగా ర్యాగింగ్ చేసింది. ఆ లేగ దూడ వెంట పడుతుంటే.. ఏనుగు వెనక్కి వెనక్కి పరుగులు తీసింది. అయితే, ఆ లేగ దూడ వెనుకాలే దాని తల్లి కూడా ఉంది. ఆ తల్లి అండ చూసుకునే అది రెచ్చిపోయినట్లుంది. అందుకే అంత ధైర్యం వచ్చింది దానికి. అయితే, ఇక్కడ ఏనుగు కూడా సరదాగా తీసుకున్నట్లుంది. అందుకే.. తనముందు చిన్న సూక్ష్మ జీవిలా ఉన్న ఆ లేగ దూడ బెదిరింపులకు సైతం భయపడిపోయినట్లు నటించింది. అది తరుముతుంటే.. ఏనుగు భయపడినట్లుగా వెనక్కి వెనక్కి పరుగులు తీసింది. ఆ తరువాత తల్లి గేదె పిల్ల గేదెను తీసుకెళ్లగా.. ఏనుగు తన దారిన తాను వెళ్లిపోయింది.

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు. లేగ దూర ర్యాగింగ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బ్యూటీఫుల్ సీన్ అంటూ మరికొందరు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..