AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిన్నారి గుండె ధైర్యం చూస్తే షాకవ్వాల్సిందే.. ఏకంగా పాముకే ముద్దు పెట్టేసింది.. భయపడేవాళ్లు చూడొద్దు

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు (Videos) అప్ లోడ్ అవుతూ ఉంటాయి. డ్యాన్స్, సింగింగ్, కుకింగ్, మేకప్, టిప్స్, హెల్త్, అడ్వెంచర్ వంటి వీడియోలు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తాయి. వీటిలో కొన్ని అద్భుతంగా అనిపిస్తే.. మరికొన్ని మాత్రం...

Viral Video: చిన్నారి గుండె ధైర్యం చూస్తే షాకవ్వాల్సిందే.. ఏకంగా పాముకే ముద్దు పెట్టేసింది.. భయపడేవాళ్లు చూడొద్దు
Child Kissing Snake
Ganesh Mudavath
|

Updated on: Jul 22, 2022 | 10:18 AM

Share

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు (Videos) అప్ లోడ్ అవుతూ ఉంటాయి. డ్యాన్స్, సింగింగ్, కుకింగ్, మేకప్, టిప్స్, హెల్త్, అడ్వెంచర్ వంటి వీడియోలు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తాయి. వీటిలో కొన్ని అద్భుతంగా అనిపిస్తే.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్న ఓ వీడియో చూసేవారికి చెమటలు పట్టిస్తోంది. ఈ వైరల్ క్లిప్‌లో ఓ చిన్నారి.. ప్రమాదకరమైన పామును ముద్దు పెట్టుకుంటుంది. అలా చేసిన తర్వాత కూడా ఆమె ఏమాత్రం భయపడకుండా తన నోటిని పదేపదే పాము దగ్గరకు తీసుకెళ్లి ముద్దులు పెడుతోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పాము చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నా.. ఆ చిన్నారిలో మాత్రం భయం కనిపించడం లేదు. ఆమె తన నాలుకను బయటకు తీసి పామును ఆటపట్టించడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత వెంటనే పామును ముద్దాడుతుంది. ఈ వీడియో నిజంగా షాకింగ్‌గా ఉంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ariana (@snakemasterexotics)

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. దీనికి ‘చుమ్మియాన్’ అనే శీర్షిక ఇచ్చారు. ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ తింటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులు అలాంటి వాటిని ప్రోత్సహించకూడదని కొందరు రాస్తే, మరి కొందరు మాత్రం చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట్లో తెగ వైరల్ అవుతోన్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల   కోసం ఈ లింక్ క్లిక్ చేయండి