Viral Village: ఆ ఊరిలో వింత రూల్.. బూతులు మాట్లాడితే ఫైన్, లేదా పనిష్మెంట్.. ఎక్కడంటే?

పెద్దల ముందు ఎవరైనా బూతులు మాట్లాడితే ఏం చేస్తారు. ఆవేం మాటలని తిట్టడమో, లేదా మరోసారి ఇలా మాట్లావద్దని హెచ్చరించడో చేస్తారు. కానీ ఇక్కడో గ్రామం మాత్రం బూతులు మాట్లాడేవారికి ఫైన్‌లు వేయడంతో పాటు గ్రామాన్ని శుభ్రం చేయాలని పనిష్మెంట్స్ ఇస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మధ్య ప్రదేశ్‌లోని బోర్సర్ అనే గ్రామం ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తుంది.

Viral Village: ఆ ఊరిలో వింత రూల్.. బూతులు మాట్లాడితే ఫైన్, లేదా పనిష్మెంట్.. ఎక్కడంటే?
Borsar Village

Updated on: Apr 11, 2026 | 5:04 PM

సమాజంలో సభ్యత, మర్యాదను పెంచడానికి మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాకు చెందిన బోర్సర్ గ్రామం ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. అక్కడ ఎవరైనా నోరు జారి అసభ్య పదజాలం వాడితే, దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం ప్రకారం, బహిరంగంగా తిట్టుకున్నా లేదా బూతులు మాట్లాడినా వారికి రూ. 500 జరిమానా, లేదా గంటపాటు గ్రామ వీధులను శుభ్రం పనిష్మెంట్స్‌ విధిస్తుంది.

సుమారు 6,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో చిన్న పిల్లలు సైతం దుర్భాషలాడటం చూసి చలించిన గ్రామ సర్పంచ్ అంతర్ సింగ్, ఉప సర్పంచ్ వినోద్ షిండే, సామాజిక కార్యకర్త అశ్విన్ పటేల్ ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీలో అధికారిక తీర్మానం చేసి, ఊరంతా పోస్టర్లు అంటించి ప్రజల్లో అవగాహన కల్పించారు. దీంతో గ్రామస్థులంతా మంచి భాషనే వాడతామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలోని వార్డు మెంబర్లు పర్యవేక్షణలో ఈ నియమం కఠినంగా అమలు జరుగుతోంది.

అయితే ఈ కొత్త విధాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం గ్రామంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందట. గ్రామంలో గొడవలు తగ్గి, గ్రామస్థుల మధ్య పరస్పర గౌరవం పెరిగిందట, అసభ్య పదజాలం తగ్గడంతో మహిళలు, కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం భాషనే కాకుండా, గ్రామాభివృద్ధిలోనూ బోర్సర్ ముందు వరుసలో ఉందిట. గ్రామంలో పరిశుభ్రత కోసం డస్ట్‌బిన్లు, మొక్కలు నాటడం, ప్రధాన కూడళ్లలో ఉచిత వై-ఫై వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారట. క్రమశిక్షణతో కూడిన ఈ సంస్కరణలతో బోర్సర్ గ్రామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆవర్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us