Viral: చేపల కోసం వల వేసిన జాలరి… బయటకు తీయగా మైండ్ బ్లాంక్ అయ్యే సీన్

ఓ మత్స్యకారుడు చేపల కోసం వల విసిరాడు. కొద్దిసేపటికి తాడు లాగితే బరువుగా అనిపించింది. సంబరపడ్డాడు. అతడు ఊహించినట్టుగానే భారీగానే చేపల పడ్డాయి. కానీ అంతలోనే షాక్ తగిలింది.

Viral: చేపల కోసం వల వేసిన జాలరి... బయటకు తీయగా మైండ్ బ్లాంక్ అయ్యే సీన్
Weirdest Fish

Updated on: Apr 07, 2022 | 10:53 AM

Trending news: ఈ మధ్య చేపల వేటకు వెళ్లిన జాలర్లకు వింత.. వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. కొండ చిలువలు, మొసళ్లు వలలో చిక్కుకుంటున్నాయి. వాటిని  చూసిన జాలర్లు బేజారవుతున్నారు. తాజాగా రష్యా(Russia)లో 39 ఏళ్ల ఫెడోర్ట్ సోవ్ అనే మత్య్సకారుడు చేపలు పట్టేందుకు సముద్ర తీరానికి వెళ్లాడు. ఎప్పటి మాదిరిగానే వల వేశాడు. వల బయటకు లాగగా.. దండిగానే చేపలు కనిపించాయి. కానీ ఆ చేపల మధ్యలో ఉన్న ఒక జీవిని చూసి.. అతను ఒకింత భయానికి, ఆశ్చర్యానికి లోనయ్యాడు. అందుకు కారణం.. ఆ జీవిని ఇంతవరకూ అతను ఎప్పుడూ చూడలేదు. దీంతో వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వెంటనే వైరల్ అయ్యింది. అయితే నెటిజన్లు కూడా ఆ జీవి ఏంటో తమకు తెలియడం లేదని కామెంట్లు పెడుతున్నారు. ఆ జీవికి రెక్కలు, పెద్ద కళ్లు, పొడవైన తోక ఉన్నాయి.. వాటిని చూసి అది పిల్ల డ్రాగన్ అని కొందరు పేర్కొంటున్నారు. ఈ ఫొటోని ఇంటర్నెట్‌లో లక్షల మంది వీక్షించారు. అయితే సముద్ర జీవుల గురించి నాలెడ్జ్ ఉన్న ఒక వ్యక్తి.. ఆ జీవి గురించి స్పష్టత ఇచ్చారు. అది ఘోస్ట్ షార్క్ అయి ఉండవచ్చని చెప్పారు. అయితే స్పష్టత మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఈ జీవి ఏంటో మీకు తెలిస్తే.. దిగువన కామెంట్ చేయండి….

Also Read: Andhra Pradesh: ఆ ఇంటి యజమానిది గుండె కాదు రాయి… అద్దెకు ఉన్న వ్యక్తి చనిపోతే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us