Video Viral: నీ లక్ బాగుంది బ్రదరూ.. కొంచెముంటే ప్రాణాలే పోయేవి.. రీల్ సీన్ ను తలపించే రియల్ సీన్

|

Aug 28, 2022 | 5:20 PM

రోడ్డుపై (Roads) వెళ్లేటప్పడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్లీ ఎప్పుడు తిరిగొస్తామో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు, రోడ్డుపై డ్రైవ్ చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు..

Video Viral: నీ లక్ బాగుంది బ్రదరూ.. కొంచెముంటే ప్రాణాలే పోయేవి.. రీల్ సీన్ ను తలపించే రియల్ సీన్
Accident Video Vrial
Follow us on

రోడ్డుపై (Roads) వెళ్లేటప్పడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్లీ ఎప్పుడు తిరిగొస్తామో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు, రోడ్డుపై డ్రైవ్ చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వీటి కారణంగా చనిపోతున్న వారి సంఖ్య కూడా భారీగా, అంతే కాకుండా తీవ్ర గాయాలతో అవస్థలు పడుతున్న వారు కోకొల్లలు. కాబట్టి రోడ్లపై అనుక్షణం జాగ్రత్తగా వ్యవహరించాలి. రోడ్లపై అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతుంటారు. ప్రమాదాల తీవ్రత వారికి మాత్రమే కాదు.. వారిని నమ్ముకున్న కుటుంబాలను కూడా అతలాకుతలం చేస్తాయి. సోషల్ మీడియాలో యాక్సిడెంట్ (Accident Videos) వీడియోలు ఎన్నో ఉన్నాయి. వాటిలోనూ హైస్పీడ్ వల్ల జరిగే ప్రమాదాలకు సంబంధించినవి చాలానే ఉన్నాయి. మీరు కూడా అలాంటి వీడియోలను చూసే ఉంటారుర. ప్రస్తుతం ఓవర్ స్పీడ్ వల్ల అయిన యాక్సిడెంట్ వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ క్లిప్ లో ఓ వ్యక్తి బైక్ పై వేగంగా దూసుకెళ్తుంటాడు. రహదారిపై రద్దీ మధ్య అతను రయ్ రయ్ మంటూ ముందుకెళ్తాడు. ఈ సమయంలో అతను అదుపుతప్పి కింద పడిపోతాడు. అప్పుడే అక్కడికి ఓ లారీ, కారు అతని బైక్ ను ఈడ్చుకుంటూ వెళ్లిపోతాయి. కొంత దూరం వెళ్లాక ఆగిపోతాయి. వీడియో చూశాక బైక్ రైడర్ ప్రాణాలు పోయినట్లే అని అందరూ అనుకుంటారు. కానీ అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇవి కూడా చదవండి

ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 31 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటి వరకు 15 వేలకు పైగా వ్యూస్ వందలాది లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా ఈ సంఖ్య పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి