Shubham Kumar: లెవల్ 22,222 అన్‌లాక్.. క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు

Candy Crush Saga World Record: చిన్నప్పుడూ ఎంతో ఇంట్రెస్ట్‌గా ఆడే క్యాండీ క్రష్ సాగా అనే గీమ్ మీ అందరికీ గుర్తుందా?.. ఒకప్పుడూ సరదాగా ఆడే ఈ గేమ్‌తోనే ఓ 19 ఏళ్ల యువకుడు ఇంటర్‌నేషనల్ బుక్‌ ఆఫ్ రికార్ట్‌ క్రియేట్ చేశాడు. అవును ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా ఏకంగా క్యాండీ క్రష్ 22,222వ లెవెల్స్ పూర్తి చేసి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Shubham Kumar: లెవల్ 22,222 అన్‌లాక్.. క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
Bihar Teen Sets Candy Crush Record

Updated on: Oct 08, 2026 | 9:39 AM

ఫోన్‌లో సరదాకోసం అడే గేమే ఓ 19 ఏళ్ల బాలుడికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిందంటే మీరు నమ్ముతారా? కచ్చితంగా నమ్మాల్సిందే.. బీహార్‌కు చెందిన 19 ఏళ్ల శుభమ్ అనే యువకుడు.. మొబైల్‌లో అందరూ ఎంతో ఇంట్రెస్ట్‌గా ఆడే క్యాండీ క్రష్ సాగా గేమ్‌లో ఏకంగా 22,222 లెవెల్స్‌ కంప్లీట్ చేసి ఇంటర్నేషనల్ బుక్‌ ఆఫ్‌ రికార్డులో తన పేరు నమోదయ్యేలా చేశారు. అతని గణతను గుర్తించిన ఇంటర్నేషన్ బుక్‌ ఆఫ్ రికార్డు సంస్థ టేనేజర్ విభాగంలో క్యాండీ క్రష్‌లో ఇన్ని లెవెల్స్ కంప్లీట్ చేసిన వ్యక్తిగా అధికారిక గుర్తింపు నమోదు చేసింది.

ఇంటర్నేషనల్ బుక్‌ ఆఫ్ రికార్డ్‌ ప్రకారం.. బిహార్‌లోని దిఘ్వారా గ్రామినికి చెందిన శుభమ్ కుమార్ జూలై 5, 2026న క్యాండీ క్రష్ గేమ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఫీట్ సాధించేటప్పటికీ అతని వయసు 19 ఏళ్ల 8 నెలల 25 రోజులని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్‌సైట్ పేర్కొంది. అయితే క్యాండీ క్రష్‌లో 22,222 లెవెల్స్ కంప్లీట్ చేసేందుకు అతనికి ఎన్ని రోజు సమయం పట్టిందనే విషయాలను మాత్రం రికార్డులో పేర్కొనలేదు. మొత్తానికి శుభమ్ టైం పాస్‌ కోసం ఆడిన గేమ్‌ ఇప్పుడు అతనికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది.

క్యాండీ క్రష్ సాగా అంటే ఏమిటి?

క్యాండీ క్రష్ సాగా అంటే.. ఇదో ఫజిల్‌ గేమ్.. ఇందులో రంగురంగుల క్యాండీలు ఉంటాయి. వాటిలో ఒకే రంగుకు చెందిన మూడు లేదా అంతకంటే ఎక్కువ క్యాండీలను వరుసలో సెట్‌ చేసి టార్గెట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో లెవెల్స్ పెరిగే కొద్ది.. మీకు టాస్క్‌లు కూడా పెరుగుతాయి. అప్పుడు మీరు మీ బ్రెయిన్‌కు మరింత పదును పెట్టి వాటిని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు లెవెల్ కంప్లీట్ చేసి ప్రతి సారి మీకు కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని మీరు చేదిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us