Viral Video: వావ్‌.. ఈ పాము ఎంత ముద్దుగా ఉంది..! వైట్‌స్నేక్‌ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు

|

Sep 12, 2024 | 4:03 PM

ఈ వీడియోలో కూడా తెల్లటి ఒక అందమైన పాము కనిపించింది. ఈ పామును చూసిన నెటిజన్లు పాము అంటే ఉన్న భయం పోగొట్టుకుంటున్నారు. అందమైన తెల్లని రంగులో కనిపిస్తున్న పాముకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో Instagram పేజీ beautifulnewpix ఫోటో-షేరింగ్ యాప్‌లో షేర్‌ చేయబడింది.

Viral Video: వావ్‌.. ఈ పాము ఎంత ముద్దుగా ఉంది..! వైట్‌స్నేక్‌ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
Beautiful White Snakes
Follow us on

పాములు అత్యంత ప్రమాదకరమైన సరీసృపాలలో ఒకటి. పాములను చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. పెద్దగా, భారీ ఆకారంలో ఉండే సర్పాలను చూస్తే, వెన్నులో ఒక్కసారిగా వణుకు పుడుతుంది. ఇక పాము కాటుకు గురైన వారిలో చనిపోతామనే భయం సాధారణంగా వెంటాడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి సంవత్సరం 81,000 నుండి 138,000 మంది పాముకాటుతో మరణిస్తున్నారు. ఇక, పాములకు సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. పాముల్లో కొన్ని అరుదైనవి అందమైన పాములు కూడా ఉన్నాయి. ప్రమాదకర పాములే అయినా, వాటిని రంగు, అందంతో మనల్ని మరి మరీ చూడాలనిపించేలా చేస్తున్నాయి.

ఈ వీడియోలో కూడా తెల్లటి ఒక అందమైన పాము కనిపించింది. ఈ పామును చూసిన నెటిజన్లు పాము అంటే ఉన్న భయం పోగొట్టుకుంటున్నారు. అందమైన తెల్లని రంగులో కనిపిస్తున్న పాముకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో Instagram పేజీ beautifulnewpix ఫోటో-షేరింగ్ యాప్‌లో షేర్‌ చేయబడింది. ప్రకాశవంతమైన తెల్లటి పాము ఎంతో అందంగా కనిపిస్తోంది.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

పచ్చటి గడ్డి మధ్యలో కనిపిస్తున్న ఈ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఈ పాము అందానికి ఫిదా అయ్యారు. ఒక్కసారి ఆ పామును చూసి కౌగిలించుకోవాలని ఉందంటూ ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి