Baby Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో చాలా వీడియోలు వైరల్గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు మనసును ఆహ్లాదపరుస్తుంటే.. మరికొన్ని ఆందోళన కలిగిస్తుంటాయి. కొన్ని వీడియోలు మాత్రం మరిచిపోలేని విధంగా మధురానుభూతిని కలిగిస్తుంటాయి. తాజాగా.. ఓ పిల్ల కోతి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పట్టు పట్టరాదు.. పట్టి విడవరాదు అన్న నీతిని రుజువు చేస్తోంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
ఈ వీడియోలో ఓ పిల్ల కోతి తన తల్లి వెంట ఉంది. ఈ క్రమంలో కోతి పిల్ల గోడపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆ గోడ తడిగా ఉండటం వల్ల కోతి పిల్ల జారి కిందపడింది. అయినా ప్రయత్నించడం మాత్రం మానలేదు. మరోసారి గోడపైకి ఎగిరగా.. మళ్లీ కింద పడింది. ఇదంతా పట్టించుకొని తల్లి కోతి గోడ ఎక్కి దర్జాగా కూర్చుంటుంది. ఈ క్రమంలో పిల్లకోతి.. దాని తోకను పట్టుకుని పైకి గోడపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. ఇలా వెంటనే ఐడియా రాగానే పిల్లకోతి.. తల్లికోతి తోక పట్టుకొని గోడపైకి ఎక్కుతుంది.
వైరల్ వీడియో..
Never give up? pic.twitter.com/3SXEX6cquM
— Vivek Nair (@viveksnair17) July 12, 2021
దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియా ప్లాట్ఫాంలల్లో తెగ వైరల్గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్లో వివేక్ నాయర్ అనే వ్యక్తి షేర్ చేయగా.. ఆ వీడియోను చాలామంది షేర్ చేసి ఫుల్లుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ పిల్ల కోతిని గమనిస్తే ఎలా ఎదగాలో తెలుస్తుందంటూ పేర్కొంటున్నారు.
Also Read: