
సాధారణంగా పెళ్లి సంబంధాల కోసం మ్యారేజ్ బ్యూరోలు, బంధువులు లేదా ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లను ఆశ్రయించడం చూస్తుంటాం. అయితే ఓ ఆటో డ్రైవర్ మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించి తన జీవిత భాగస్వామిని వెతికే ప్రయత్నం చేశాడు. అతడు చేసిన వింత పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు ఆటో డ్రైవర్ తన ఆటోలోనే ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేశాడు. అందులో తనకు ఇంకా వివాహం కాలేదని, భర్త లేని మహిళలు లేదా జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న వారు తనను సంప్రదించవచ్చని పేర్కొన్నాడు. అంతేకాకుండా లివింగ్ రిలేషన్‌షిప్‌పై ఆసక్తి ఉన్నవారు కూడా తనను సంప్రదించవచ్చని పేర్కొనడం విశేషం. అందులో తన మొబైల్ నంబర్‌ను కూడా ఉంచాడు.
ప్రయాణికులు ఆటోలో ప్రయాణించే సమయంలో ఈ ప్రకటనను చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఈ ఆలోచనను క్రియేటివ్ థాంట్‌గా అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇలాంటి ప్రకటనను ఆటోలో చూడటం ఇదే మొదటిసారి అంటూ స్పందిస్తున్నారు. వ్యాపార ప్రచారం కోసం ఆటోలపై ప్రకటనలు కనిపించడం సాధారణమే అయినప్పటికీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రకటనను ఈ విధంగా ప్రదర్శించడం అరుదైన విషయమని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియా వేదికల్లో వేగంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జీవిత భాగస్వామి కోసం ఓ ఆటో డ్రైవర్ ఎంచుకున్న ఈ విభిన్న మార్గం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి