Viral video: లిఫ్ట్‌లో ఓ మూలన ఓనర్‌తో పెంపుడు కుక్క.. మరో మూలన డెలివరీ బాయ్.. అంతలోనే..

|

Sep 07, 2022 | 3:28 PM

ఎలివేటర్‌లో అప్పటివరకు ఆ పెట్ డాగ్ బాగానే ఉంది. లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే బయటకు తీసుకెళ్తుండగా.. మూలన నిల్చుని ఉన్న డెలివరీ బాయ్‌పై ఒక్కసారిగా అటాక్ చేసింది.

Viral video: లిఫ్ట్‌లో ఓ మూలన ఓనర్‌తో పెంపుడు కుక్క.. మరో మూలన డెలివరీ బాయ్.. అంతలోనే..
Pet Dog Attack
Follow us on

Trending Video: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌(Ghaziabad)లోని లిఫ్టు లోపల పెంపుడు కుక్క బాలుడిని కరిచిన సిసిటివి ఫుటేజీ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో సర్కులేట్ అయిన రెండు రోజుల తరువాత నోయిడా( Noida)కు సంబంధించిన అదే తరహా మరో వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో ఓ యువకుడిపై పెట్ డాగ్ లిఫ్ట్‌లో అటాక్ చేసింది. సెక్టార్ 75లో ఉన్న నోయిడాలోని అపెక్స్ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. యజమానితో పాటు లిఫ్ట్‌లో ఉన్న పెంపుడు కుక్క..  ఓ మూల నిలబడి ఉన్న యువకుడిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లి కరిచింది. 15-20 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. సమీపంలోని మెడికల్ స్టోర్‌కు చెందిన డెలివరీ బాయ్‌ ఆర్డర్ నిమిత్తం తమ అపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు కుక్కు దాడి చేసిందని సొసైటీ వాసులు వెల్లడించారు. కుక్క యజమాని బాధితుడితో అన్ని విషయాలు తేల్చుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. చికిత్సకు అవసరమైన డబ్బు కూడా అతను ఇచ్చాడని తెలిపారు.

వీడియో చూడండి…

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి