Viral Video: పిచ్చి పీక్స్ అంటే ఇదే మరి..! నెట్టింట రచ్చ చేస్తున్న పుచ్చకాయ పాప్‌కార్న్.. వీడియో

|

Jun 20, 2022 | 7:06 AM

మీకు పాప్ కార్న్ ఇష్టమయితే.. ఈ వీడియో చూస్తే తల తిరగడం ఖాయం.. పుచ్చకాయ పాప్‌కార్న్ వీడియో చూసిన నెటిజన్లు.. ఇదేంటిరా నాయనా అంటూ తలబాదుకుంటున్నారు.

Viral Video: పిచ్చి పీక్స్ అంటే ఇదే మరి..! నెట్టింట రచ్చ చేస్తున్న పుచ్చకాయ పాప్‌కార్న్.. వీడియో
Watermelon Popcorn
Follow us on

Watermelon popcorn: సోషల్ మీడియా ప్రపంచంలో ఇటీవల పలు రకాల వినూత్న వంటకాలు వైరల్ అవుతున్నాయి. ఈ వింత వంటలను చూసి ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, వెజ్ ఫిష్ ఫ్రై, పచ్చి మిర్చి హల్వా, కొత్తిమీర ఐస్ క్రీం ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో రకాల వంటకాలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మరో సరికొత్త వంటకం నెట్టింట ట్రెండ్ (Trending) అవుతోంది. ఇది చూసి వామ్మో ఇదేంటిరా నాయనా..? అంటూ కొందరు పేర్కొంటుంగా.. ఇదేదో ట్రై చేద్దాం అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా.. పుచ్చకాయ పాప్‌కార్న్ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సాధారణంగా సినిమా ఇంటర్‌వెల్‌లో లేదా స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు పాప్‌కార్న్ తింటుంటారు. అయితే ఈ పాప్‌కార్న్ లలో పలు రకాల ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. మీకు పాప్ కార్న్ ఇష్టమయితే.. ఈ వీడియో చూస్తే తల తిరగడం ఖాయం.. పుచ్చకాయ పాప్‌కార్న్ వీడియో చూసిన నెటిజన్లు.. ఇదేంటిరా నాయనా అంటూ తలబాదుకుంటున్నారు.

ఈ వింత రుచిగల పాప్‌కార్న్ వీడియోను కప్తాన్ హిందూస్తాన్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వైరల్ అవుతున్న వాటర్ మెలన్ పాప్‌కార్న్ వీడియోలో ఒక కళాయిలో నూనె మరుగుతోంది. దానిలో ఒక వ్యక్తి పుచ్చకాయ ముక్కను వేస్తాడు. దానిని చిన్న చిన్న ముక్కలుగా విడదీస్తాడు. కొద్దిసేపటి తర్వాత నూనె ఎర్రగా కనిపిస్తుంది. ఈ నూనెలో మొక్కజొన్న ప్యాకెట్ ను వేస్తాడు. వెంటనే మొక్కజొన్న గింజలు పాప్ కార్న్‌గా మారడాన్ని చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో.. 

సాధారణంగా పాప్ కార్న్ తయారుచేసేటప్పుడు ఒక పాత్రను వేడి చేసి దానిలో మొక్కజొన్న గింజలను వేసి మూత పెట్టాలి. ఆ తర్వాత క్రమంగా చిన్ని మంటపై మొక్కజొన్న పాప్‌కార్న్‌గా మారుతుంది. అయితే ఈ వినూత్న ప్రయోగం చాలా మందికి నచ్చడంలేదు. దీంతోపాటు పలురకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..