ఇది చివరి పాండమిక్ కాదు, మనం పాఠాలు నేర్చుకోక పోతే ముప్పే, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వార్నింగ్ ! బీఅలెర్ట్ !

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ పెద్ద 'బాంబు పేల్చారు'. ప్రపంచ దేశాలకు ఇదే చివరి పాండమిక్ కాదని, మనం గుణపాఠాలు నేర్చుకోకపోతే ముప్పు తప్పదని హెచ్ఛరించారు...

ఇది చివరి పాండమిక్ కాదు, మనం పాఠాలు నేర్చుకోక పోతే ముప్పే, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వార్నింగ్ ! బీఅలెర్ట్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 27, 2020 | 10:42 AM

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ పెద్ద ‘బాంబు పేల్చారు’. ప్రపంచ దేశాలకు ఇదే చివరి పాండమిక్ కాదని, మనం గుణపాఠాలు నేర్చుకోకపోతే ముప్పు తప్పదని హెచ్ఛరించారు. వాతావరణ మార్పులు, పరిరక్షణ, జంతు సంక్షేమం..వీటిపై దృష్టి నిలపకపోయిన పక్షంలో.. మానవాళి ఆరోగ్యానికి చేపట్టే అన్ని చర్యలూ విఫలమవుతాయి అని అన్నారు. ‘ఎపిడమిక్ ప్రిపేర్డ్ నెస్’ పై అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వీడియో ద్వారా మెసేజ్ ఇచ్చిన ఆయన.. మనం ఎంతసేపూ తాత్కాలిక నివారణా పధ్దతులపైనే దృష్టి పెడుతున్నామని చెప్పారు. ఔట్ బ్రేక్ ను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు డబ్బును వినియోగించే ప్రమాదకరమైన స్వల్ప విధానాలను పాటిస్తున్నాయని. కానీ తదుపరి ముప్పు గురించి ఆలోచించడం లేదని టెడ్రోస్ చెప్పారు. కోవిడ్ 19 నుంచి మనం గుణపాఠాలు నేర్చుకున్నామా అని చెప్పాలంటే లేదనే చెప్పాలి…దీని అదుపునకు నిధులు వెదజల్లుతున్నాం.. పరిస్థితి కొంత మెరుగుపడినట్టు అనిపించగానే నిర్లక్ష్యం వహిస్తున్నాం అన్నారాయన. తరువాతి పరిణామాలపై దృష్టి పెట్టడంలేదన్నారు.   ఇది డేంజర్ అన్నారు.

ఈ పాండమిక్ మానవాళి ఆరోగ్యానికి, జంతువులకు, గ్రహాలకు మధ్య లింక్ ని చూపుతోందని ఆయన చెప్పారు. చైనాలో గత డిసెంబరులో మొదలైన కరోన వైరస్ బారిన పడి  1.75 మిలియన్ల మంది మరణించారు. 80 మిలియన్ కేసులకు పైగా నమోదయ్యాయి.

Read More:

తెలంగాణ కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 472 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి..

Corona Cases India: దేశంలో కొత్తగా 18,732 పాజిటివ్ కేసులు, 279 మరణాలు.. పెరుగుతున్న రికవరీ రేటు..

Aviation: ఏవియేషన్ రంగానికి ఎదురుదెబ్బ… కరోనా కారణంగా నష్టాల్లోకి విమానయాన సంస్థలు…