పింఛన్ల సొమ్ము దోపిడి..వెంటాడిన 1000 మంది..ఎక్కడ..?

ఆమె ఓ పంచాయితీ కార్యదర్శి..యదామాములుగా ఫస్ట్ తారీఖు కావడంతో..వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు ఇచ్చేందుకు బ్యాంక్‌ నుంచి డబ్బు డ్రా చేసింది. కానీ ఆ డబ్బు కాజేయాలని పక్కా ప్లాన్ వేసుకున్న ఓ దొంగ..నక్కి నక్కి చూసి..ఆవిడ ఆటో ఎక్కగానే బ్యాగ్ లాక్కోని పరారయ్యాడు. అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ పంచాయితీ కార్యదర్శి  పోలీసులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఈ లోపులో విషయం ఆ నోటా..ఈ నోటా పాకి […]

పింఛన్ల సొమ్ము దోపిడి..వెంటాడిన 1000 మంది..ఎక్కడ..?
Follow us

|

Updated on: Nov 01, 2019 | 5:22 PM

ఆమె ఓ పంచాయితీ కార్యదర్శి..యదామాములుగా ఫస్ట్ తారీఖు కావడంతో..వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు ఇచ్చేందుకు బ్యాంక్‌ నుంచి డబ్బు డ్రా చేసింది. కానీ ఆ డబ్బు కాజేయాలని పక్కా ప్లాన్ వేసుకున్న ఓ దొంగ..నక్కి నక్కి చూసి..ఆవిడ ఆటో ఎక్కగానే బ్యాగ్ లాక్కోని పరారయ్యాడు. అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దీంతో ఆ పంచాయితీ కార్యదర్శి  పోలీసులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఈ లోపులో విషయం ఆ నోటా..ఈ నోటా పాకి పక్కనే ఉన్న రెండు గ్రామాలకు చేరింది. ప్రజల సొమ్ము కావడంతో వారే రంగంలోకి దిగారు. ఓ ఆర్మీ రేంజ్‌లో ఫామై ప్రతి  చెట్టూ, పుట్టా గాలించారు. అసలే తాము పెరిగిన  ప్లేసు కావడంతో ఆ ఈశ్వరుడైనా వారి నుంచే తప్పించుకునే పరిస్థితి లేనంతగా వారి వెతుకులాట సాగింది.

దొంగతనం జరిగిన కొన్ని గంటలకే అతన్ని పట్టి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు గ్రామస్థులు. రికవరీ చేసిన రూ.16 లక్షల సొత్తును   పంచాయతీ కార్యదర్శి రామలక్ష్మమ్మకు అందజేశారు. దొంగను పట్టుకోవడంలో సహకరించిన గ్రామస్థులను పోలీసులు అభినందించారు.